అవమానించాడనే: వెంటాడి, వేటాడి సుధీర్‌ను చంపేశారు

హైదరాబాద్: తమను అవమానించాడనే ఇంటర్మీడియట్ విద్యార్థి సుధీర్‌ను చంపినట్లు నిందితులు అంగీకరించారు. అందరి ముందు తమను అవమానించాడని, జనమంతా చూస్తుండగా చేయి చేసుకున్నాడని, ఇష్టం వచ్చినట్లు తిట్టాడని వారు చెప్పారు

కూకట్‌పల్లి హత్య వెనుక అసలు కారణాలు? ఎవరీ సుధీర్?

అవమానం భరించలేక సుధీర్‌ను చంపాలని నిర్ణయించుకున్టన్లు తెలిపారు. పరీక్షలు రాయడానికి వెళ్తున్న సుధీర్‌ను నలుగురు స్నేహితలం కలిసి చంపినట్లు చెప్పారు. నడిరోడ్డుపై వెంటాడి వేటాడి వారు సోమవారం సుధీర్‌‌ను చంపేసిన విషయం తెలిసిందే.

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సుధీర్ హత్య కేసులోని నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఏసిపి ఎన్. భుజంగరావు, సిఐ వడ్డే ప్రసన్నకుమార్ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఇలా గొడవ జరిగింది...

ఇంటర్మీడియట్ చదువుతున్న మూసాపేటకు చెందిన ఎలగల సుధీర్ (19) ఈ నెల 9వ తేదీన స్థానికంగా ఉన్న సభ్యత మైదానంలో అదే ప్రాంతానికి చెందిన ఇప్పలి కృష్ణ స్నేహితులతో గొడవ పడ్డాడు. సుధీర్‌‌ను ఆ విషయంపై కృష్ణ ప్రశ్నించాడు. దాంతో వారిద్దరికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కృష్ణపై సుధీర్ చేయి చేసుకున్నాడు.

ఆ విషయం చెప్పాడు...

గొడవ విషయాన్ని సుధీర్ తన సోదరుడు ప్రసాద్‌కు చెప్పాడు. అదే రోజు సాయంత్రం సుధీర్, ప్రసాద్‌లతో కృష్ణ మిత్రులు జిల్లా మహేష్, నవీన్‌లు గొడవకు దిగారు. అందరూ చూస్తుండగా మహేష్, నవీన్‌లను ప్రసాద్, సుధీర్ కొట్టారు. రాత్రి 9 గంటల సమయంలో మల్లన్న ఆలయం సమీపంలోకి వెళ్లి మహేష్‌కు అక్కడే ఉన్న సుధీర్, ప్రసాద్ కనిపించారు. వారితో మహేష్ గొడవ పడ్డాడు.

దాంతోనే హత్య చేయాలని...

తనపై దాడికి దిగిన సుధీర్‌ను చంపేయాలని మహేష్ నిర్ణయించుకున్నాడు. స్నేహితులు కృష్ణ, నవీన్, తేజలతో కలిసి పథకం రచించాడు. రెండు వేటకొడవళ్లు కొనుగోలు చేసి వాటిని తేజ హోండా యాక్టివాలో దాచి పెట్టాడు. సుధీర్ కదలికలు తెలుసుకోవడానికి అదే ప్రాంతానికి చెందిన బైరెడ్ల శివ సహాయం తీసుకున్నారు.

కాపు కాసి దాడి చేశారు..

సోమవారం ఉదయం సధీర్ పరీక్ష రాసేందుకు టూవీలర్‌పై బయలుదేరి వసుంధర ఆస్పత్రి రోడ్డులో వస్తున్నట్లు శివ ద్వారా తెలుసుకున్నారు. దాంతో మహేష్, మరో ముగ్గురు జాతీయ రహదారి పక్కనే ఉన్న సాగర్ హోటల్ వద్ద కాపు కాశారు. సుధీర్ రావడంతో అతడిని బైక్‌పై నుంచి లాగి కత్తులతో దాడి చేశారు. దాంతో సుధీర్ కుప్పకూలిపయాడు.

పోలీసులు ఇలా ప్రయత్నం

అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రభాకర్,అంజి నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించారు.ముగ్గురు పారిపోగా వారికి నవీన్ చిక్కాడు. అతని ద్వారా మిగతా నిందితుల సమాచారం తెలుసుకున్న పోలీసులు మహేష్, శివలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు కృష్ణ, తేజ పరారీలో ఉన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top