నగ్న చిత్రాలతో వివాహితను బ్లాక్‌మెయిల్, అత్యాచారం

హైదరాబాద్: ఒకే స్కూల్లో చదువుకొన్న సమయంలో తోటి విద్యార్థిని నగ్న చిత్రాలను ఆమెకు తెలియకుండా తీసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నగ్న ఫోటోలను చూపి వివాహితను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు నగ్నఫోటోల కోసం రూ. 2.50 లక్షలను వసూలు చేశాడు. వేధింపులు కొనసాగుతుండడంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. షీ టీమ్స్ నిఘా వేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబ్‌‌నగర్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు రవి నాగర్ కర్నల్ జిల్లా కల్వకుర్తిలో పదో తరగతి చదువుకొన్నాడు ఆ సమయంలో అదే పాఠశాలలో చదువుకొన్న విద్యార్థినితో చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు, కాని ఆ విద్యార్థిని నిరాకరించింది.

ఆమెకు 2014 లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. ఆమె భర్తతో కలిసి హైద్రాబాద్ నగరంలోని బడంగ్‌పేట ప్రాంతంలో నివాసం ఉంటుంది. అయితే ఆమె ఫోన్‌ నెంబర్‌ను సంపాదించిన నిందితుడు వేధించడం ప్రారంభించాడు.

నగ్న చిత్రాలను పంపి వేధింపులు

పదో తరగతి చదవే సమయంలో తన సహచర విద్యార్థినికి తెలియకుండా రవి ఆమె నగ్న చిత్రాలను తీశాడు. వివాహమైన తర్వాత ఆమె ఫోన్‌ నెంబర్‌ను 2017లో సంపాదించి తనతో రోజు మాట్లాడాలని వేధింపులకు గురి చేసేవాడు. ఆమె మాట్లాడకుండా కట్ చేసింది. అంతేకాదు నిందితుడి ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసింది. కానీ. ఆ నిందితుడు ఓక రోజు వివాహిత నగ్న చిత్రాలను ఆమె సెల్‌పోన్‌కు పంపాడు. వేరే నెంబర్‌తో పోన్‌లో వేధింపులకు పాల్పడ్డాడు.

నగ్న చిత్రాలను భర్తకు పంపుతానని బెదిరింపులు

పదో తరగతి చదువుతున్న సమయంలో తాను తీసిన నగ్న చిత్రాలను భర్తకు పంపుతానని ఆ వివాహితను నిందితుడు బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. తనకు డబ్బులిస్తే నగ్న చిత్రాలను డిలీట్ చేస్తానని ఆమెకు నమ్మించాడు. భర్తకు తెలియకుండా ఆమె రూ.2.50 లక్షలను రవికి ఇచ్చేసింది. అయినా ఫోటోలు డిలీల్ చేయలేదు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేకపోతే భర్తను చంపేస్తానని, పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు.

వివాహితపై అత్యాచారం

ఈ ఏడాది జనవరి 18వ తేదిన బాధితురాలిని కల్వకుర్తిని హనుమాన్ దేవాలయం వద్దకు రావాలని ఆహ్వనించాడు. అక్కడికి వస్తే నగ్న చిత్రాలను డిలీట్ చేస్తానని హమీ ఇచ్చాడు. అయితే అక్కడికి వెళ్ళిన ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై దాడికి పాల్పడి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు.

షీ టీమ్స్‌ను ఆశ్రయించిన బాధితురాలు

రవి వేధింపులు భరించలేక బాధితురాలు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. షీ టీమ్స్ అడిషనల్ డీసీపీ సలీమా, వనస్థలిపురం ఏసీపీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసుల బృందం రవిని మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుండి సెల్‌ఫోన్, ద్విచక్రవాహన్ని స్వాధీనం చేసుకొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top