హైదరాబాద్ లో సామూహిక స్వచ్ భారత్

హైదరాబాద్: నగరంలోని బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో 15వేల మంది పాల్గొన్నారు. వీరంతా ఒకే సారి మూడు నిమిషాల పాటు చీపురు పట్టి సామూహికంగా రోడ్లు ఊడ్చి గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఆజామాబాద్‌లోని వీఎస్టీ చౌరస్తా నుంచి ఆర్టీసీ కళాభవన్‌, డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ కళాశాల మీదుగా సుందరయ్య పార్కు వరకు గల మెయిన్‌‌రోడ్‌లో ఈ సామూహిక స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిర్వహిస్తున్నారు. రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మంత్రులు కేటీఆర్‌, నాయిని, తలసాని, మహమూద్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇప్పటికే గుజరాత్ వడోదరలో జరిగిన సామూహిక స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 5058 మంది పాల్గొని రెండు నిమిషాల పాటు రోడ్లను ఊడ్చి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించారు. దీనిని అధిగమించి మరో రికార్డును సృష్టించేందుకు నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంనగర్‌ డివిజన్‌లోని 26 పాఠశాలలకు చెందిన 8,500 మంది విద్యార్థులు, ఆరు కళాశాలలకు చెందిన 2 వేల మంది కళాశాల విద్యార్థులు, 600 మంది టీచర్లు, 800 మంది వాలంటీర్లతో పాటు మరో 3 వేల మంది వివిధ కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్‌లకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని నిమిత్తం 15వేల చీపురు కట్టలు కొనుగోలు చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top