హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

గ్రామాల్లో పలు అత్యవసర సేవలందిస్తున్న అంగన్‌వాడీలకు హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వేసవి సెలవులు, అంగాన్‌వాడీలకు అందించే సరుకులు సక్రమంగా అందించేందుకు చేప ట్టాల్సిన భవిష్యత్‌ కార్యచరణపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు హైదరా బాద్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా అంగన్‌వాడీలకు హెల్త్‌కార్డు లను త్వరలోనే అందించాలని అధికారులు తీర్మానాలు చేశారు. చాలీచాలని వేతనాలతో కాలం వెళ్ల్లదీస్తున్న అంగన్‌వాడీలకు అడిగిన దానికంటే అదనంగా వేతనాలు పెంచటం, పలు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం... విద్యను బలోపేతం చేసేందుకు, కేజి టు పీజి ఉచిత విద్యలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో నడిపించేందకు చర్యలు చేపట్టింది.

ఇప్పటికే చాలా కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1605 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 291 మినీ అంగన్‌వాడీకేంద్రాలు ఉన్నాయి. అందులో 1596 మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లు. 280 మినీ అంగన్‌వాడీ టీచర్లు, 1568 ఆయాలు పనిచేస్తున్నారు. అయితే జిల్లాలో టీచర్లు, ఆయాలు 57 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి త్వరలో హెల్త్‌కార్డులు మంజూరు కానున్నట్టు అధికారులు అంటున్నారు.

వేసవి సెలవులకూ గ్రీన్‌సిగ్నల్‌...

అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరంగా నిర్వహిస్తున్నారు. అయితే వేసవిలో చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావటానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా అంగన్‌వాడీలకు వేసవి సెలవులు డిమాండ్‌ ఉండగా... ఎట్టకేలకు ప్రభుత్వం దానికీ సానుకూలంగా స్పందించిందని అధికారులు అంటున్నారు. వేసివలో ఎండ తీవ్రతను ధృష్టిలో ఉంచుకొని కొన్ని నిబంధనలతో కూడిన సెలవులను మంజూరు చేయనున్నట్టు తెలిసింది. దీంతో అంగన్‌వాడీ సిబ్బందిలో ఆనందం పెల్లుబుకుతోంది.

ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా సెలవులివ్వాలి- నల్లమోతు రమాదేవి

అంగన్‌వాడీలకు వెసవి సెలవుల ఆలోచన మంచిదే. ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చే విధంగా సెలవులి వ్వాలి. కు టుంబానికి రూ.పది లక్షల ప్రీమియం వర్తించేలా హెల్త్‌ కార్డులివ్వాలి. కష్టానికి ప్రతి ఫలం అందిం చిన రోజున మరిన్ని సేవలు అందించటంలో ఎవరూ వెనుకాడబో రు. ఈవేస వి నుంచే సెలవులు మంజూరు చేయాలి. ప్రభుత్వం ఆవైపుగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు: ఉల్లంగి పద్మ

ఎన్నో ఏళ్లుగా ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మాకు హెల్త్‌కార్డులు ఇవ్వడం శుభపరి ణామం. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. అదేవిధంగా వేసవి సెలవుల పైనా కచ్చితమైన మార్గదర్శకా లు విడుదల చేసి సెలవులు మంజూరు చేయాలి. ప్రస్తుతం ప్రజలతో మమేకమై పుట్టుక నుంచి మరణం వరకు అన్నిరకాలు సేవలను అందిస్తున్నాం. మరిన్ని సదుపాయాలు కల్పిస్తే మరిన్ని సేవలు అందించేందుకు మరింత ముందుంటాం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top