బి. గురునాథ్‌రెడ్డి గురువారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత బి. గురునాథ్‌రెడ్డి గురువారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే... ఆయన చేరికను అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి గట్టిగా వ్యతిరేకిస్తుండడంతో ఇంతకాలం ఈ వ్యవహారం ఉత్కంఠ కలిగించింది. పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం తన చాంబరుకు ప్రభాకరచౌదరిని పిలిపించుకుని నచ్చజెప్పారని, దాంతో గురునాథ్‌రెడ్డి చేరికకు మార్గం సుగమమైందని టీడీపీ వర్గాలు తెలిపాయి.

అనంతపురంలో మిస్సమ్మ బంగ్లా భూ కుంభకోణంలో గురునాథ్‌రెడ్డి ప్రమేయం ఉందని, ఆయన్ను తీసుకుంటే పార్టీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని ముఖ్యమంత్రితో ప్రభాకర్‌ చౌదరి అన్నారు. ‘ఆ కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోంది. అందులో చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరు దోషులైతే వారిని చట్టం శిక్షిస్తుంది. అనంతపురంలో పార్టీ బలోపేతానికి గురునాథ్‌రెడ్డిని తీసుకోవాలని నిర్ణయించాం. ఆయన నీ నాయకత్వంలోనే పనిచేస్తారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ కూడా నీదే. అందులో మార్పు లేదు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకొన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది’ అని చంద్రబాబు చెప్పారు

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top