పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

భువనేశ్వర్‌: ఒడిశాలోని కటక్‌లో గూడ్స్‌ రైలు ఒకటి పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ.. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆదివారం మధ్యాహ్నం కటక్‌ రైల్వే స్టేషన్‌లోని గూడ్స్‌ షెడ్‌ నుంచి వస్తుండగా.. శిఖర్‌పూర్‌ లెవల్‌ క్రాసింగ్‌ వద్ద గూడ్స్‌రైలుకు చెందిన ఒక వ్యాగన్‌ పట్టాలు తప్పింది. ఈ మేరకు తూర్పుకోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు.

ప్రమాద ఘటనతో ఆ మార్గంలో వెళ్లే మూడు రైళ్లు రెండు గంటల మేర ఆలస్యమయ్యాయి. ప్రమాద సమయంలో వేర్వేరు సమయంలో వాటిని నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం ట్రాక్‌ను పునరుద్ధరించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top