అత్యాచారం.. ఆపై సజీవదహనం

ఖగారియా: స్నేహితుడని నమ్మితే.. అతడే ఆమె నిండు ప్రాణాలు బలితీసుకున్నాడు. అత్యాచారానికి పాల్పడటమేగాక.. కిరోసిన్‌ పోసి సజీవదహనం చేశాడు. ఈ దారుణమైన ఘటన బిహార్‌లోని ఖగారియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

టెంతాకరారీ గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ఒకే కళాశాలలో చదువుతున్నారు. ఆదివారం యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆ యువకుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆమెపై అత్యాచారం చేసి.. అనంతరం కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. తర్వాత యువతి ఉన్న గదికి బయట నుంచి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మంటల్లో కాలిపోతున్న ఆమె అరుపులు విన్న స్థానికులు తలుపులు పగలగొట్టి యువతిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోయే ముందు తనపై దాడి చేసింది తన స్నేహితుడేనని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు, అతడి కుటుంబసభ్యలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top