చిత్తూరులో ఘోర అగ్నిప్రమాదం

నగరమంతా నిద్రలోకి జారుకుంది..సమయం ఒంటిగంటన్నరయింది.. చిన్నపాటిగా ప్రారంభమైన మంటలు..క్షణాల్లోనే ఎగసిపడ్డాయి.. ఒక్కసారిగా అలజడి.. అగ్ని కీలలకు భవనంలోని సరుకంతా బూడిదయింది. యజమానికి విషయం తెలియదు.. ఆయన చేరుకునే సరికే అగ్నికి భవనమంతా ఆహుతయింది. విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు.

చిత్తూరులోని చర్చివీధిలో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి అపూర్వ టెక్స్‌టైల్స్‌లో రూ.5కోట్ల విలువైన వస్త్రాలు దగ్ధమైనట్లు అంచనా..ఇదొక్కటే కాదు ఇటీవల తిరుపతిలోనూ ఒక హోటల్‌లో మంటలు చెలరేగాయి. వ్యాపారులు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. సంబంధిత అధికా రులూ పట్టించుకోవడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు.

మొన్న తిరుపతిలో చందనా బ్రదర్స్‌ వ్రస్త్ర దుకాణంలో..నిన్న రేణిగుంట రోడ్డులో బాణసంచా ఫ్యాక్టరీలో..నేడు చిత్తూరులో అపూర్వ వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. కనీస జాగ్రత్తలు పాటించక పోవడం..ధనార్జన పరమావధిగా వ్యాపారం.. అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండానే భారీ భవంతులు నిర్మిం చడం.. వెరసి అనుకోని ఘటనలు జరిగనప్పుడు భారీ ఆస్తి నష్టం సంభవిస్తోంది. నిత్యం జన సందడితో ఉండే సినిమాథియేటర్లు, విద్యాసంస్థలు, వస్త్ర దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ఫ్యాక్టరీలు, అపార్ట్ట్‌మెంట్లు, బ్యాంకులు, రైల్వేస్టేషన్, బస్‌స్టే్టషన్లు ఇలా ఏ సంస్థ భవనానికైనా భద్రత ఉండాల్సిందే.

అగ్నిప్రమాదం జరిగినా, విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరిగినా ఆస్తినష్టం, ప్రాణాపాయం జరగకుండా, తగ్గించేలా నిబంధనలున్నాయి. జిల్లాలో ఆ నిబంధనలను పాటించేవారు కరువయ్యారు. జిల్లాలో అగ్ని మాపకశాఖ అనుమతులు లేని భవనాలపై ‘సాక్షి’ శుక్రవారం పరిశీలించింది. పలు చోట్ల భద్రత లేని భవనాలు, అనుమతులు లేనివి గుర్తించింది. వాటిపై ఫోకస్‌

జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరాల్లో, ప్రధాన పట్టణాలైన మదనపల్లె, పుత్తూరు, పీలేరులో అగ్నిమాపకశాఖ అనుమతులు లేకుండా వివిధ సంస్థల భారీ భవంతులు వెలుస్తున్నాయి. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు కూడా అనుమతి లేకపోవడం విశేషం. నగరాలలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, బ్యాంకుల్లో ఎటువంటి సౌకర్యాలు ఉండడం లేదు. జిల్లాలో అగ్నిమాపక శాఖ అనుమతులు లేని భవనాలను శుక్రవారం ‘సాక్షి’ పరిశీలిం చింది. పలు చోట్ల భద్రత లేని భవనాలు, అనుమతులు లేని భవనాలను గుర్తించింది.

జిల్లాలో 53 సినిమా థియేటర్లు ఉండగా, అందులో 15 మాత్రమే నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి. కొన్నింటికి గతంలో నోటీసులు జారీచేయగా వారు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయని అధి కారిక సమాచారం. ఆస్పత్రుల విషయానికి వస్తే మరీ దారుణం. ప్రధాన పట్టణాలలో ప్రముఖ వీధుల్లో ఆస్పత్రుల వనాలు కోకొల్లలుగా నడుస్తున్నాయి. అగ్నిప్రమాదం సంభవిస్తే నష్టం ఊహకందని స్థితిలో ఉంటుంది.

గతంలో ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి చాలా మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. అలాంటి ప్రమాదకర పరిస్థితే జిల్లాలో కూడా ఉంది. జిల్లా లో ఓ మోస్తారు ప్రైవేట్‌ ఆసుపత్రులు 275వరకు ఉండగా, అందులో సగానికి పైగా అగ్నిమాపక శాఖ అనుమతులు లేవు.

అభద్రత నడుమ వ్యాపార సముదాయాలు..

అందరినీ ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన రంగులు, కళ్లు జిగేల్‌ మనిపించేలా అద్దాలు, ఆకట్టుకునే లైటింగ్‌ అలంకరణలతో ఎంతో అందంగా అనేక వ్యాపార సముదాయాలు కనిపిస్తుంటాయి. ఆ సముదాయాల యజమానులు తమ వ్యాపా ర అభివృద్ధి కోసం వాటిని నిర్వహిస్తున్నారు తప్పితే ప్రజల భద్రత కోసం ఎలాంటి నిబంధనలను పాటించడం లేదు. కొన్ని షాపింగ్‌ కాంప్లెక్సులలోకి రావడానికి, వెళ్లడానికి ఒకే దారి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా అలా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగితే ప్రజలు బయటకు రాలేని దుస్థితి. జిల్లాలో అతిపెద్ద వాణిజ్య సదుపాయాలు 878 ఉండగా అందులో 12శాతంవాటికే అనుమతులు ఉన్నట్లు తెలిసింది.

పరిశ్రమల్లో..

జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రైలు పెట్టెల నుంచి అగ్గిపెట్టెల దాకా అన్ని రకాల వస్తువులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఆ ఫ్యాక్టరీలలో తమ పొట్టకూటి కోసం వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంబంధిత యాజమాన్యాలు వారి నుంచి శ్రమ దోచుకొంటున్నారు తప్పితే వారి ప్రాణాలకు మాత్రం భద్రత కల్పించడం లేదు. కోట్ల రూపాయాలను సంపాధనగా పెట్టుకున్న ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించకుండా అధికార పలుకుబడి ని చూపి తప్పించుకుంటున్నారు.

గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకులుకూడా అంతే..

జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల కంపెనీలకు చెందిన పెట్రోలు బంకులు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారాయి. జిల్లా సుమారు 350 పెట్రోల్‌ బంకులు ఉంటే అందులో40 శాతం వాటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ప్రజలకు సరఫరా చేసే గ్యాస్‌ ఏజెన్సీలలో కూడా తప్పకుండా నిబంధనలు పాటించాలి.

నిబంధనలు ఇలా ..

– భవనాలలో 10 వేల లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంక్‌ ఉండాలి.

– ట్యాంకులలో నిల్వ ఉంచిన నీటిని ఇతర సౌకర్యాలకు వినియోగించకుండదు.

– భవనంలో 450 ఎల్‌పీఎం పంప్‌ పనిచేస్తూ ఉండాలి.

– ఎయిర్‌ ఎగ్జిట్‌ ఫ్యాన్లు ఎప్పుడూ పనిచేసేలా అందుబాటులో ఉంచుకోవాలి.

– కార్బన్‌∙డై ఆకై ్సడ్‌ (సీఓ–2) సిలిండర్‌ లను అందుబాటులో ఉంచాలి.

– ఎగ్జిట్‌ విషర్, డీసీబీ సిలిండర్లు ఫోమ్‌ అందుబాటులో ఉండాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top