రెండో భార్య దగ్గరకు వెళ్తూ.. కొడుకును ఇంట్లో బంధించిన కసాయి తండ్రి

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి రెండో భార్య వద్దకు వెళ్లేందుకు తన కొడుకును ఇంట్లోనే అయిదు రోజుల పాటు బంధించాడు.

అతనిని కట్టేసి వెళ్లడంతో నరకయాతన అనుభవించాడు. నిందితుడైన ఆ తండ్రి పేరు సులేమన్. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య కొడుకును ఇంట్లోని చీకటి గదిలో కట్టేసి రెండో భార్య వద్దకు వెళ్లాడు.

స్థానికులు దీనిని ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు ఆ బాలుడిని బయటకు తీసుకు వచ్చారు. తండ్రి సులేమన్‌పై కేసు నమోదు చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top