ట్విట్టర్లో రెచ్చిపోయిన డిగ్గీరాజా, మోదీ మీద మహాబూతులు!

సీనియర్ కాంగ్రెస్సేరియన్ దిగ్విజయ్ సింగ్ మళ్ళీ సీన్లోకొచ్చేశారు. తెలంగాణ ఇంచార్జ్ పోస్ట్ నుంచి ఊడబీకబడ్డారని, మధ్యప్రదేశ్ పాదయాత్ర కోసం పంచె ఎగ్గట్టేస్తున్నారని ఆ మధ్య డిగ్గీ వార్తల్లో కనిపించారు. ఈసారి.. ప్రధాని మోదీని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో చెలరేగిపోయారాయన. మోదీ అనుచరులను 'భక్తులుగా' పేర్కొంటూ అభ్యంతరకరమైన భాషలో ఒక ఫోటో-పోస్ట్ పెట్టారు. విధిలేని పరిస్థితుల్లోనే ఇటువంటి పోస్ట్ పెట్టాల్సి వస్తోందంటూ రైటప్ కూడా ఇచ్చుకున్నారు. గతంలో సీఎంగా, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న డిగ్గీ స్థాయికి ఇది తగింది కాదంటూ విమర్శలు పడిపోతున్నాయి.


Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top