యాదాద్రి కి సీఎం కెసిఆర్

సీఎం కేసీఆర్‌ శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. గుట్ట ఆలయాన్ని దేశంలోనే అద్భుతమైన ఆలయంగా అభివృద్ధి చేయాలనుకుంటున్న కేసీఆర్‌ ఇక్కడ ఏడాదిన్నర కాలంగా సాగుతున్న పనులను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. ప్రధాన ఆలయ ముఖ మండప నిర్మాణంలో అత్యంత విశేషమైన భారీ కాకతీయ పిల్లర్‌కు సీఎం ప్రతిష్ఠాపన పూజలు నిర్వహిస్తారు.

బ్రహోత్సవాల నాటికి గర్భాలయ దర్శనాన్ని ప్రారంభిస్తామని ఆలయ నిర్వాహకులు చెప్తున్నా.. పనుల పురోగతి ఆ స్థాయిలో లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ ఎలా స్పందిస్తారోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా యాదాద్రికి ఉదయం 10.15 గంటలకు చేరుకుంటారు. 10.25 గంటలకు కొండపైకి చేరుకుని బాలాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.10 గంటలకు గుట్ట నుంచి బయల్దేరి యాదగిరిపల్లి శివారులో స్థానిక నేత వివాహ వేడుకలో పాల్గొంటారు. తిరిగి వచ్చి గుట్టపై ఆలయ అభివృద్ధి పనులు, పెద్దగుట్టపై టెంపుల్‌ సిటీ లే అవుట్‌ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top