మెలకువ వచ్చింది.. ప్రాణం నిలిచింది..!

ఢిల్లీలో ఓ దొంగ కత్తితో ఓ వ్యక్తిని పొడవడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. ముఖ్యంగా ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో.. ఆ తర్వాత ఆ వీడియో బయటకు రావడంతో అక్కడి ప్రజలు షాక్ అవుతున్నారు. వివరాలలోకి వెళితే, ఢిల్లీలోని చాందీ చౌక్ ఏరియాలో ఓ స్టేర్ పై ఓ దుకాణం ఉండగా.. దాని ముందే గతరాత్రి సెక్యూరిటీ గార్డు నిద్రపోతూ ఉన్నాడు. ఈ సందర్భంగా రాత్రి సమయమని భావించి అక్కడి మెట్లు ఎక్కి దొంగతనానికి మంకీ టీషర్ట్ లో వచ్చిన ఓ దొంగ.. అక్కడ సెక్యూరిటీ గార్డును చూసి తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని బయటకు తీశాడు. ఆ తర్వాత కత్తి పిడిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని.. రెండు మూడు సార్లు కిందికి వంగి చూసి, కాళ్ళు, తలభాగం ఎటువైపు ఉందా అని పరిశీలించి.. అనంతరం బలంగా ఆ కత్తితో అతడ్ని పొడిచేసే ప్రయత్నం చేశాడు. అయితే, అదే సమయంలో దొంగ అలికిడిని రెప్పపాటులో గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే పక్కను జరిగి ఆ పోటు నుంచి తప్పించుకోవడంతో బ్రతికిపోయాడు. ఆ తర్వాత క్షణంలోనే స్వల్ప గాయాలతో మెట్లపై నుంచి దొర్లుతూ ఆ ప్రాంతం నుంచి బయటకు పరిగెత్తాడు. ఈ సమయంలోనే ఆ దొంగ కూడా అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. ప్రస్తుతం వీడియో ఫుటేజ్ ఆధారంగా టీనేజ్ కుర్రాడిలా ఉన్న ఆ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారని సమాచారం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top