దేశ అభివృద్ధి ప్రణాళికల్లో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఒక కీలక భాగం

దిల్లీ: రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆయన ఆన్‌లైన్‌ చర్చావేదిక క్వోరా (www.quora.com)లో ఓ ప్రశకు విశ్లేషణాత్మక సమాధానం రాశారు. ఈ వేదికలో ఔత్సాహికులు ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తారు. గోయల్‌ విశ్లేషణను దాదాపు 33,000 మంది చదవడం విశేషం. ఇంతకూ ఆయన దేని గురించి రాశారంటే..

బుల్లెట్‌రైలు అవసరమా!

‘భారత దేశానికి నిజంగా బుల్లెట్‌ రైలు అవసరమా?’ అని ఒకరు ప్రశ్నించి సమాధానాలను ఆహ్వానించారు. స్పందించిన పీయూష్‌ గోయల్‌ గణాంకాలు, పట్టికలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌ సహితంగా అద్భుత విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. దేశ అభివృద్ధి ప్రణాళికల్లో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఒక కీలక భాగమని అన్నారు. అది ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతను చిహ్నంగా పేర్కొన్నారు

.

అప్పుడూ ఇలాగే..

‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌కు చాలా అవసరాలున్నాయి. దేశ అభివృద్ధి ప్రణాళికలో ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌ అప్‌గ్రేడేషన్‌ ఒక భాగం. అందులో భాగంగా వేగంగా ప్రయాణించే బుల్లెట్‌ రైలు అవసరమే. రక్షణ, వేగానికి పెద్దపేట వేసి, ప్రజలకు సేవలందించే బుల్లెట్‌ రైలు ఎన్‌డీయే ప్రభుత్వ దార్శనిక ప్రాజెక్టు. దీని సాయంతో భారత్‌ రైల్వే పరంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. కొత్త సాంకేతికతకు అలవాటు పడే క్రమంలో ఇబ్బందులు తప్పవు. ఐతే అవి దేశానికి కచ్చితంగా లాభం చేకూరుస్తాయి.’

‘1968లో రాజధాని రైళ్ల ఆవిష్కరణను రైల్వేబోర్డు ఛైర్మన్‌ సహా అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడవి అత్యంత ప్రాధాన్యంగా మారాయి. అన్నిటినీ వ్యతిరేకిస్తే భారత్‌ తిరోగమనం వైపు వెళ్తుంది. గతంలో మొబైల్‌ ఫోన్ల సాంకేతికత వినియోగానికి భారతీయులు సిద్ధంగా లేరని అంతా అనుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్న రెండో అతిపెద్ద దేశం భారత్‌. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు సైతం ఇలాంటిదే’ అని మంత్రి వివరణ ఇచ్చారు. ఆయన సమాధానానికి చాలామంది మద్దతు పలికారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top