బెజవాడలో రెచ్చిపోతున్న బైక్‌ రేసర్లు

విజయవాడ: విజయవాడలో బైక్‌ రేసర్లు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రివేళ మితిమీరిన వేగంతో యువకులు బైకు రేసులు నిర్వహిస్తున్నారు. నగరంలో నిత్యకృత్యంగా మారిన రేసింగ్‌లతో జనాలు భయంతో వణికిపోతున్నారు. కనక దుర్గమ్మ వారధి, కృష్ణలంక నేషనల్ హైవేలపై ఈ బైక్ రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.

బడాబాబుల కొడుకులు కూడా రేసింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. గతంలో రేసింగ్‌ల వల్ల పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top