పెళ్లి పందిరికి నిప్పుపెట్టిన ప్రేయసి

పుణె: తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకుంటున్న ప్రియుడిపై ఓ 36 ఏళ్ల మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా ఏకంగా అతడి పెళ్లి పందిరిని తగులబెట్టింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తొలుత గత ఆదివారం తన బైక్‌ను ఎవరో తగులబెట్టారని ఫిర్యాదు చేసిన వ్యక్తి తాజాగా తాను మరో రోజు పెళ్లి చేసుకోబోతుండగా పెళ్లి పందిరికి నిప్పు పెట్టారంటూ అదే వ్యక్తి ఫిర్యాదు చశాడు. దీంతో అప్పటికే బైక్‌ విషయాన్ని విచారిస్తున్న పోలీసులు మరో ఫిర్యాదుతో దర్యాప్తు కోణాన్ని మార్చి చూశారు.

వ్యక్తిగతంగా అతడిపై కక్ష పెంచుకున్న వాళ్లెవరయినా ఇలా చేసి ఉంటారా అని విచారించి ఓ వ్యక్తి సమాచారం ఆధారంగా దత్తానగర్‌లో 36 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె ఆ రెండు నేరాలు తానే చేసినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమెకు ఆదివారం వరకు కస్టడీ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తికి తనకు ఆరేళ్లుగా సంబంధం ఉందని, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు తనకు ఎలాంటి సమాధానం చెప్పకుండానే మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడని చెప్పింది. ఈ విషయాన్ని తాను అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులకు చెప్పినా వారు లెక్కచేయలేదని దీంతో తాను పెళ్లి పందిరి తగులబెట్టానని చెప్పింది. అలాగే, బైక్‌ కూడా తానే బహుమతిగా ఇచ్చానని, అందుకే కోపంతో దానికి కూడా నిప్పు పెట్టినట్లు వెల్లడించింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top