పట్టాలు తప్పిన హైదరాబాద్ ప్యాసింజర్

బెంగళూరు : ఔరంగాబాద్ - హైదరాబాద్ ప్యాసింజర్ రైలు శుక్రవారం పట్టాలు తప్పింది. కల్గూపూర్‌-భీల్కీ రైల్వేస్టేషన్ల మధ్య ఈ రోజు ఉదయం రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు రైలు ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు రైల్వే శాఖ హెల్ప్‌ లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్‌: 040-23200865, పర్లీ: 02446-223540,వికారాబాద్: 08416-252013 ‌, బీదర్‌: 08482-226329. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top