బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం

మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే డ్రైవర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి చేశాడు. గ్యారంపల్లికి చెందిన రెడ్డి శేఖర్‌(30) సోమవారం మధ్యాహ్నం బస్టాండ్‌లో నిలబడి ఉండగా ఓ ఆగంతకుడు అతడిని కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచాడు. అక్కడున్న వారు కేకలు వేయటంతో ఆ వ్యక్తి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శేఖర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top