ఆ బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి: హైకోర్టు

లక్నో: 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అయితే శుక్రవారం ఉదయమే ఆయనను సీబీఐ తమ నిర్బంధంలోకి తీసుకొని ప్రశ్నించింది. ఈ రేప్ రేసులో విచారణను తాము పరిశీలిస్తుంటామని ఈ సందర్భంగా కోర్టు స్పష్టంచేసింది. సీబీఐ కుల్‌దీప్‌పై నమోదైన మూడు కేసులను విచారించనుంది. కఠినమైన పోస్కో(POSCO) చట్టం కింద కుల్‌దీప్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేయాల్సిందిగా గురువారం రాత్రి యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేయగా.. గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగి కుల్‌దీప్‌ను అదుపులోకి తీసుకుంది.

రేప్, గొడవలు, బాధితురాలి తండ్రిని హత్య చేసిన కేసులు కుల్‌దీప్‌పై నమోదయ్యాయి. ఈ కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న యూపీ సర్కార్‌పై అలహాబాద్ హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అసలు కుల్‌దీప్‌ను అరెస్ట్ చేస్తారా లేదా అని నిలదీసింది. గతేడాది జూన్‌లో కుల్‌దీప్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top