భక్తులతో కిటకిటలాడుతున్నా శివాలయాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ఆదిదేవుడికి అర్చనలు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడి ఆలయంతో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో పాటు మురముళ్ల, పట్టిసీమలోని వీరేశ్వరస్వామి ఆలయం, కుండలేశ్వరంలోని కుండలేశ్వరస్వామి ఆలయం సహా ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అన్ని శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి.

తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top