కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిని..

ముంబై: వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్‌ మాజీ పోటీదారు అర్మాన్‌ కోహ్లిపై కేసు నమోదైంది. ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, పారిపోయిన అతని కోసం ముంబై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శాంతాక్రజ్‌ పోలీసుల కథనం ప్రకారం...

ప్రాధేయపడ్డా వినిపించుకోకుండా ఉన్మాదిలా..: స్టైలిస్ట్‌ నీరూ, నటుడు అర్మాన్‌ కోహ్లిలు గడిచిన మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇద్దరూ తరచూ కీచులాడుకునేవారు. ఇటీవల గోవాలోని ఓ విల్లా విక్రయానికి సంబంధించి గొడవ తారాస్థాయికి చేరింది. ఇదే విషయమై ఆదివారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. ఒకదశలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా అతను వినలేదు. కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. కాగా, కోహ్లి అప్పటికే అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

బడా దర్శకుడి సుపుత్రుడు: బాలీవుడ్‌లో 70,80వ దశకాల్లో ‘నాగిన్‌’, ‘జానీ దుష్మన్‌’, ‘రాజ్‌ తిలక్‌’, లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన దర్శకుడు రాజ్‌కుమార్‌ కోహ్లి తనయుడే అర్మాన్‌ కోహ్లి. కొడుకును హీరోగా నిలబెట్టేందుకు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలం కావడంతో రాజ్‌కుమార్‌ మిన్నకుండిపోయారు. మొదట్లో హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగిన అర్మాన్‌.. బిగ్‌బాస్‌ షోతో ఒక్కసారే బడా సెలబ్రిటీ అయిపోయాడు. బిగ్‌బాస్‌-7 షో జరుగుతుండగానే కో-పార్టిసిపెంట్‌ తనీషా ముఖర్జీతో అర్మాన్‌ రొమాన్స్‌ చేయడం, మరో నటి సోఫియాతో గొడవపడటం, పోలీసులు ఏకంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిమరీ అర్మాన్‌ను అరెస్టు చేయడం అప్పట్లో పెనుదుమారం రేపింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top