ఫీజు చెల్లించలేదని చిన్నారిని బంధించి

ఫీజు చెల్లించలేదన్న కారణంలో ఓ నాలుగేళ్ల చిన్నారిని బంధించింది ఓ పాఠశాల యాజమాన్యం. పిల్లాడన్న కనీస జ్ఞానం లేకుండా కొన్ని గంటలపాటు గదిలో నిర్బంధించింది. ఈ ఘటన యూపీలోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. అభయ్‌ సోలంకి అనే నాలుగేళ్ల చిన్నారి స్థానిక అశోక్‌ పబ్లిక్‌ అండ్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు. గడువు ముగిసినా ఫీజు కట్టలేదు చిన్నారి పేరెంట్స్.

దీంతో స్కూల్‌ ముగిసి తర్వాత చిన్నారులు ఇంటికి వెళ్లిపోయినా.. అభయ్‌ని ఇంటికి పంపించకుండా గదిలోనే ఉంచేశారు. పిల్లాడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. ఫీజు చెల్లిస్తే అభయ్‌ని పంపిస్తామని మెలిక పెట్టింది యాజమాన్యం. డబ్బు అందగానే ఫీజు చెల్లిస్తానని అభయ్‌ తండ్రి చెప్పినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో ఏదోలా చిన్నారిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన తర్వాత స్కూల్‌ యజమాని, ప్రిన్సిపల్‌ పరారీలో ఉన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top