ఘోర రోడ్డుప్రమాదం: 20 మంది మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన లారీ 20 మంది ప్రాణాల్ని బలిగొంది. ఈ ఘటన జిల్లాలోని ఏర్పేడు పోలీస్ట్ స్టేషన్ కు సమీపంలోనే జరిగింది. పూతలపట్టు నాయుడకు పేట రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఓ లారీ అతి వేగంతో వెళుతోంది. వేగం మరీ ఎక్కువవ్వడంతో డ్రైవర్ లారీని అదుపు చేయలేకపోయాడు.

దీంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని తాకి, పక్కన ఉన్న దుకాణాల మీదకి లారీ దూసుకెళ్లిపోయింది. దీంతో ఇరవై మంది అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉండడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top