డ్రైవర్‌కు నిద్రమత్తు..గాల్లో కలిసిన 14 ప్రాణాలు

ఇస్లామాబాద్: మినీ బస్‌ డ్రైవర్‌ కునుకుపాటు 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ సమీపంలో చోటుచేసుకుంది. పంజాబ్‌లోని ఝాంగ్‌ నుంచి ఇస్లామాబాద్‌ వైపు వెళ్లున్న ఓ మినీ బస్‌ రాజధాని సమీపంలోని చక్రి ప్రాంతం చేరుకోగానే డ్రైవర్‌ నిద్ర మత్తుతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు.

దీంతో ముందున్న సిమెంట్‌ లోడు ట్రక్కును బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు బస్సులో మంటలు చెలరేగాయి. అగ్ని తాకిడికి నలుగురు చిన్నారులు సహా 14 మంది గుర్తు పట్టలేని విధంగా కాలిపోయారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారానే మృతులను గుర్తు పట్టేవీలుంటుందని పోలీసు విభాగం అధికార ప్రతినిధి మహ్మద్‌ అలీ ఖొఖర్‌ తెలిపారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top