లోయలో పడ్డ బస్సు : 13 మంది మృతి

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ఆల్మోరా జిల్లాలోని తోటమ్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top