కారులో పదడుగుల కింగ్‌ కోబ్రా

బీజింగ్‌: ఏంచక్కా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళదామనుకున్న యజమానికి పెద్ద షాక్‌ ఎదురైంది. కారు ఇంజిన్‌ను చెక్‌ చేద్దామనుకున్న ఆ వ్యక్తికి ఓ పదడుగుల భారీ కింగ్‌ కోబ్రా దర్శనం ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఎగిరిపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. దీంతో నలుగురు పోలీసులు అక్కడికొచ్చి ఆ పామును బయటకు తీసేందుకు నానా తంటలు పడ్డారు.

పామును పట్టే స్టిక్‌లతో కారు వద్దకు చేరుకుని మూడు మీటర్లు పొడవుండి దాదాపు ఐదు కేజీల బరువున్న(4.6కేజీలు) పామును ఎట్టకేలకు బంధించారు. దానిని చూసిన అక్కడి వారంతా బెదిరిపోయారు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్‌ చేయగా దాదాపు 70వేలమంది వీక్షించగా వెయ్యిమంది తిరిగి కామెంట్లు చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top