మెట్రో వర్కర్లను ఢీకొట్టిన ట్రక్కు.. ముగ్గురు మృతి

కొచ్చి: కేరళలో దారుణం జరిగింది. మెట్రో పనుల్లో నిమగ్నమైన కూలీలను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వర్కర్లు మృతిచెందారు. ఈ ఘటన అలువలోని మటన్ యార్డ్‌లో చోటుచేసుకున్నది. చనిపోయినవారు కొచ్చి మెట్రోలో కాంట్రాక్టు వర్కర్లుగా పనిచేస్తున్నారు. కేరళ పోలీసులు ఈ ఘటన పట్ల విచారణ చేపట్టారు. గురువారం మధ్య రాత్రి ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఫూటేజ్ ద్వారా ట్రక్కు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top