ఒక్క నవ్వు.. వేల మందిని ఫిదా చేసింది

హైదరాబాద్: ఒక్క నవ్వు.. కొన్ని వేల మంది మనసును దోచింది. అవును.. మీరు చూస్తున్న ఈ ఫొటో.. పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే కొన్ని వేల లైకులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇది ఎవరు పోస్ట్ చేశారు అనేగా మీ సందేహం.. అడీషనల్ కమీషనర్‌ ఆఫ్ ఫోలీస్ స్వాతీ లక్రా ట్విట్టర్‌లో దీనిని పోస్ట్ చేశారు.

ఈ ఫొటో వెనుక స్టోరీ ఏమిటంటే... ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని ఎవరో కిడ్నాప్ చేశారు. అయితే నాంపల్లి ఎస్‌హెచ్ఓ ఇన్‌స్పెక్టర్ ఆర్. సంజయ్ 15 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. అనంతరం ఇన్‌స్పెక్టరే స్వయంగా ఆ చిన్నారిని తన తల్లికి అప్పగించారు. నిందితుల నుంచి చిన్నారిని కాపాడినప్పటి నుంచి బుడతడిని ఇన్‌స్పెక్టర్ ఆర్. సంజయ్ తన వద్దనే ఉంచుకుని ముద్దాడారు. ఆ క్షణంలో తీసిన ఫొటోనే ఇది. దీనిని ఈనెల 7న స్వాతీ లక్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు దీనికి 23 వేల లైకులు వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రీట్వీట్ చేస్తున్నారు.


Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top