దేశంలో అవినీతి పెరిగిపోయింది : సోనియా

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీలో సోనియా ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ చిక్‌మగ్‌లూరు నుంచి అఖండ విజయం సాధించి దేశానికి సేవలందించారు. త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సోనియా ధీమా వ్యక్తం చేశారు. అందరి ఐక్యత వల్లే పదేళ్లు అధికారంలో ఉండగలిగాం. 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. యూపీఏ 1లో చేసిన అభివృద్ధి వల్లే రెండోసారి అధికారంలోకి రాగలిగామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం ప్రతి ఒక్కరి విజయంగా భావించాలి. కాంగ్రెస్ క్షీణిస్తున్న దశలో తాను పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆమె స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సోనియా పిలుపునిచ్చారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top