మెట్రోరైలుల స్మార్ట్‌కార్డుతో ఛార్జీలో 10% రాయితీ

మెట్రోరైలులో స్మార్ట్‌కార్డుతో ప్రయాణించేవారికి ఛార్జీలో 10% రాయితీ లభించనుంది. గురువారం నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ కార్డుదారులకు ఇప్పటివరకూ 5% రాయితీయే లభించేది. రూ.200 చెల్లించి స్మార్ట్‌కార్డును తీసుకోవాలి. ఇందులో రూ.100 ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. గరిష్ఠంగా రూ.3వేల వరకు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఏడాదిపాటు ఈ కార్డు చెల్లుబాటవుతుంది. స్టేషన్లలోని టికెట్‌ కౌంటర్ల వద్ద వీటిని పొందవచ్చు. ఎల్‌అండ్‌టీ మెట్రో ప్రయాణికుల వెబ్‌సైట్‌; టీ-సవారీ యాప్‌; స్టేషన్లలోని యాడ్‌-వాల్యూ యంత్రాల ద్వారా కార్డులను రీఛార్జ్‌ చేసుకోవచ్చు. పేటీఎం ద్వారా తొలిసారి రూ.100, ఆపైన రీఛార్జ్‌ చేసుకుంటే రూ.20 వరకు వెనక్కి ఇస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ తెలిపింది. ఇప్పటివరకు 1.70 లక్షల స్మార్ట్‌కార్డులు అమ్ముడుపోయాయి.

ప్రయాణ వేళలు: మొదటి రైళ్లు నాగోలు, అమీర్‌పేట, మియాపూర్‌ స్టేషన్ల నుంచి ఉదయం 6 గంటలకు, చివరి మెట్రో 10 గంటలకు బయల్దేరతాయి.

ఫేక్‌టోకెన్స్‌: ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ వ్యవస్థను పరీక్షించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. అసలు టోకెన్స్‌తో ఇవి కలిసి ఉంటాయి. తర్వాత వీటిని వ్యవస్థ నుంచి తొలగిస్తారు.

తాగునీరు: స్టేషన్లలో ‘వాటర్‌ డిస్పెన్సింగ్‌ కియోస్క్‌’లను ఏర్పాటుచేశారు.

మూత్రశాలలు: మొదటి అంతస్తులో ఒకవైపే మూత్రశాలలు ఉన్నాయి. మరోవైపు దిగినవారు సిబ్బందిని అడిగి అక్కడికి వెళ్లవచ్చు.

పార్కింగ్‌: నాగోలు, పరేడ్‌గ్రౌండ్స్‌, రసూల్‌పురా, బాలానగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ స్టేషన్ల వద్ద వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. మరికొన్ని స్టేషన్ల వద్ద ప్రభుత్వం పార్కింగ్‌ ప్రదేశాలను సూచించింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top