ప్రపంచ కాలేయ దినోత్సవం: కొన్ని దైనందిక అలవాట్లు కూడా మీ కాలేయo పై ప్రభావం చూపుతాయని తెలుసా ?

ఎక్కువమంది అభిప్రాయం ప్రకారం మద్యపానం మాత్రమే కాలేయంపై ప్రభావాన్ని చూపిస్తుంది అని నమ్ముతుoటారు. ఒకవేళ మీరు మద్యపానానికి వ్యతిరేకులైతే, మీ కాలేయం ఆరోగ్యంగా, రక్షణతో ఉన్నదని నమ్ముతారు. కానీ కొన్ని ప్రతికూల ప్రభావాలు, మీ కాలేయానికి అనేక సమస్యలు తేగలవని కూడా మనసులో ఉంచుకోవాలి. ఈ ప్రపంచ కాలేయ దినోత్సవం నాడు, మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకొనుటకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన వివరాలు పొందుపరచబడినవి. కొన్ని మీ దైనందిక అలవాట్లే మీ కాలేయoపై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయని తెలిస్తే, మీరు ఆశ్చర్యానికి లోనుకాక మానరు. ఉదాహరణకు రోజూ పాలలో లేదా కాఫీలో తీసుకునే చక్కెర పదార్దాలు. ఒకవేళ మీరు అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు అలవాటుపడినా, లేదా ఎక్కువ మోతాదులో రోగనిరోధక ఔషధాలకు అలవాటు పడినా ఆ ప్రభావం ఖచ్చితంగా కాలేయం మీద ఉంటుంది. నిజానికి కాలేయం జీవక్రియలను, జీర్ణవ్యవస్థను నియంత్రించుటలో మరియు శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగించుటలో ఎంతగానో సహాయం చేస్తుంది. మీరు నోటిద్వారా తీసుకున్న ఏ ఆహారమైనా అది ఖచ్చితంగా కాలేయానికి ఏదో ఒకరూపంలో చేరుతుంది. కావున తీసుకునే ఆహార ప్రణాళికలో భాగంగా తృణధాన్యాలు, ప్రోటీన్లు, పాలపదార్ధాలు, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకర క్రొవ్వుపదార్ధాలు ఉండేలా చూసుకోవడం ద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవచ్చు. అసలు ఏ అలవాట్లు కాలేయం పై చెడు ప్రభావాలను చూపుతాయో తెలుసా? 1.మనోవ్యాకులత పోగొట్టే ఔషదాలు: డిప్రెషన్ వంటి మానసిక రోగాలకు మందులు తీసుకొనేవారు, ఆ మందుల వలన కాలేయంపై కలిగే ప్రభావాలను గురించిన అవగాహన కూడా కలిగి ఉండాలి. దీనికోసం, మీ వైద్యుని అడిగి తెల్సుకోవడం అన్నిటా మంచిది. వికారం, అలసట, నీరసం వంటి అనేక సమస్యలు ఈ డిప్రెషన్ మందుల వలన కలుగుతుంది. సమస్యలు ప్రారంభంలో ఉన్నప్పుడే వైద్యుని పర్యవేక్షించడం మంచిది. ఇవి కాలేయానికి ప్రతిబంధకాలుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు. ఇవి కాలేయాన్ని విష ప్రభావాలకు సైతం గురి చేయడం తో పాటు ప్రాణాంతకాలుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. 2.సాఫ్ట్ డ్రింక్స్: సాఫ్ట్ డ్రింక్స్ లో ఎక్కువ మోతాదులో కృత్రిమ చక్కెరలు మరియు కార్బోనేటెడ్ మిశ్రమాలతో నిండి ఉంటుంది. అనగా కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఈ కృత్రిమ చక్కెరలు, మరియు కార్బన్ డై ఆక్సైడ్ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. ముఖ్యంగా వీటి ప్రభావం కాలేయం మీద ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కృత్రిమ చక్కెరలలో ఉండే ఫ్రక్టోజ్, ఖచ్చితంగా కాలేయాన్ని నాశనం చేస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. మరియు ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని సైతం అడ్డుకుని టైప్ 2 డయాబెటిస్ కు కారణం అవుతుంది. ౩. నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు : నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలలో ఎక్కువ శాతం కృత్రిమ క్రొవ్వులు, కృత్రిమ చక్కెరలు ఉంటాయి, ఇవి ఆరోగ్యo పై పెను ప్రభావాన్ని చూపించగలవు. ఊబకాయం, అస్తవ్యస్త జీవ క్రియలు, జీర్ణాశయ పని తీరు మందగింపు, మూత్రాశయ సంబంధిత సమస్యలు, రక్తంలో గ్లూకోజ్ స్తాయిలు హెచ్చుమీరడం, రక్త పోటు, హృదయ సంబంధిత వ్యాధులు మొదలైన వాటికి కారణo అవుతుంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చిప్స్, బర్గర్స్ మొదలైనవి ఇలాంటి సమస్యలకు కారకాలు. ఎక్కువ అనారోగ్యకర కృత్రిమ క్రొవ్వులు కలిగిన ఆహార పదార్ధాలు తీసుకోవడం మూలంగా కాలేయ పనితీరు అస్తవ్యస్తంగా తయారవుతుంది. తద్వారా కాలేయ భాగంలో మంట, అసౌకర్యంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. 4.ఉప్పు: ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం, అతిగా తీసుకుంటే విషం. ముఖ్యంగా అధికoగా ఉప్పు తీసుకున్న వారిలో కాలేయ వాపు వ్యాధిని కనుగొన్నట్లు అనేక పరిశోధనలు తేల్చాయి కూడా. మరియు ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వలన అధిక రక్తపోటుకు కూడా కారకంగా మారుతుంది. ఇవి నెమ్మదిగా గుండెపోటుకు లేదా హృదయ సంబంధ వ్యాధులకు కూడా కారణమవుతాయి. ఉప్పు అధికంగా తీసుకోవడం కాలేయ కణాలకు కూడా అసౌకర్యాన్ని కలిగించి ఫైబ్రోసిస్ కు దారితీస్తుంది. కావున ఉప్పును తగ్గించి తీసుకోవడం అన్నిటా శ్రేష్ఠం. 5. చిరుతిళ్ళు జంక్ ఫుడ్ అలవాటు ఉండడం కాలేయానికి అంత మంచిది కాదని నిపుణులు ఎంతోకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన , నిల్వ ఉంచిన ఆహార పదార్ధాల కారణంగా శరీరంలో అధిక క్రొవ్వులు పేర్కొని పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది అన్నిటా మంచిది కాదు. ఒక్కోసారి ఈ పదార్ధాలు తీసుకున్న అనతి కాలంలోనే కడుపులో, గుండెల్లో మంట, గాస్ చేరడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. కావున జంక్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. 6.ఊబకాయం : ఊబకాయం ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా కాలేయ వాపు వ్యాధికి ప్రధాన కారణంగా పరిణమిస్తుంది. టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ తగ్గడం, హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు, నిద్ర లేమి, మూత్ర పిండాలలో రాళ్ళు, గౌటు, పెద్ద ప్రేగు కాన్సర్, మొదలైన అనేక ప్రతికూల ప్రభావాలకు కూడా కారణం అవుతుంది. మద్యపానం అలవాటు లేకపోయినా కూడా, కాలేయపు వాపు వ్యాధికి ఊబకాయం ప్రధానకారణంగా మారుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. 7. విటమిన్ ఎ సప్లిమెంట్స్ విటమిన్ ఎ సప్లిమెంట్స్ కూడా కాలేయాన్ని నాశనం చేస్తాయా ? ఆశ్చర్యంగా ఉంది కదా. ఎక్కువ మోతాదులో విటమిన్ ఎ తీసుకోవడం కూడా కాలేయానికి ప్రమాదమే , మరియు నియాసిన్ స్థాయిలు పెరగడంలో కూడా సహాయం చేస్తాయి. అంతర్జాతీయ హెపటైటిస్ ఫౌండేషన్ నివేదికల ప్రకారం, విటమిన్ ఎ (రెటినాల్) అధికంగా తీసుకోవడం మూలంగా కాలేయానికి విషపూరిత ప్రభావాలను కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. రోజులో ౩౦౦౦ మైక్రోగ్రామ్స్ కన్నా అధికంగా విటమిన్ ఎ తీసుకోవడం మంచిది కాదు. 8. చక్కర ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం కృత్రిమ చక్కర నిల్వలు శరీరానికి ప్రతికూల ప్రభావాలనే అందిస్తాయి. మరియు కాలేయ వాపు వ్యాధికి దారితీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చక్కెరలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో అధిక కొవ్వులు ఏర్పడడానికి కారణం అవుతుంది. తద్వారా కాలేయ వాపు వ్యాధికి కారణాలుగా పరిణమిస్తాయి. కావున చక్కెరల కన్నా, సహజ సిద్దమైన తేనె లేదా కొద్ది మోతాదులో బ్రౌన్ షుగర్ తీసుకోవలసినదిగా నిపుణులు సూచనలు చేస్తుంటారు. 9.విటమిన్ డి సప్లిమెంట్స్: విటమిన్ ఎ వలెనే విటమిన్ డి కూడా. నిజానికి విటమిన్ డి శరీరానికి అత్యంత కీలకమైన విటమిన్, ఇది ఎముకల పటుత్వానికి ముఖ్య కారకం. కానీ రోజులో 1250 మైక్రో గ్రామ్స్ ఎక్కువగా తీసుకోవడం మూలంగా కాలేయంలో విష పదార్ధాలు పెరగడానికి కారణంగా తయారవుతాయి. బరువు తగ్గడం, వికారాలు మొదలైనవి విటమిన్ డి అధికమయినప్పుడు సూచనలుగా ఉంటాయి. 10.రెడ్ మీట్ : మాంసంలో ఉండే అధిక ప్రోటీన్, అధిక క్రొవ్వులు కాలేయానికి తీవ్రమైన ప్రభావాలను ఇస్తుంటాయి. ముఖ్యంగా రెడ్ మీట్ లో ఉండే అనారోగ్య క్రొవ్వులు గుండె సంబంధిత రోగాలకు కూడా కారణాలుగా మారుతాయి. రెడ్ మీట్ లో 50 నుండి 75 శాతం కాలరీలు క్రొవ్వురూపంలోనే ఉంటాయి. కావున అధికంగా రెడ్ మీట్ తీసుకోవడం కాలేయానికి అత్యంత ప్రమాదకరం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top