అబ్బాయిల డ్రెస్సింగ్ లో అమ్మాయిలకి నచ్చని విషయాలు

ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారంటే ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించక తప్పదేమో. ముఖ్యంగా పార్డ్ నర్ యొక్క లుక్స్ మీద, డ్రెస్సింగ్ స్టయిల్ మీద బాగానే దృష్టిపెడుతున్నారు నేటి యువతీయువకులు. అబ్బాయిలైతే తమ గర్ల్ ఫ్రెండ్ డ్రెస్సింగ్ లో ఒకటే విషయం గమనిస్తారట .. అదే సైజ్ .. అమ్మాయి ఏ సైజు బట్టలు వేసుకుంది, ఆమె డ్రెస్ వలన శరీరం ఎక్కడెక్కడ కప్పబడింది, ఎక్కడెక్కడ కప్పబడలేదో చూస్తారు. ఎందుకు అంటే ఏం చెబుతాం .. పరాయి మగాడు ఎక్కడ వేరే కళ్ళతో తన అమ్మాయిని చూస్తాడో అని భయం. ఇంతకుమించి అబ్బాయిలు మరో విషయం గమనించరేమో .. కాని అమ్మాయిలు అలా కాదు. వారు అబ్బాయిల డ్రెస్సింగ్ లో రకరకాల విషయాలు గమనిస్తారు. అబ్బాయి డ్రెస్సింగ్ లో వారికి నచ్చని అంశాలు కూడా బాగానే ఉంటాయి.

* అబ్బాయి వదులుగా బట్టలు వేసుకుంటే అమ్మాయిలకి పెద్దగా నచ్చదంట. అదే అమ్మాయి టైట్ బట్టలు వేసుకుంటే అబ్బాయికి నచ్చదు .. రిలేషన్ షిప్ ఇలా రివర్స్ అభిప్రాయాలు ఉంటాయి. కండలు తిరిగిన తన బాయ్ ఫ్రెండ్ దేహాన్ని టైట్ బట్టల్లో ఎంజాయ్ చేయడం అంటే అమ్మాయిలకి అదో సరదా అనుకోండి. ఇది నా బాయ్ ఫ్రెండ్ పర్సనాలిటి అంటూ వేరే అమ్మాయిలు అసూయ పడేలా చేయడం ఆమెకి ఇష్టం. కాబట్టి టైట్ బట్టలే వేయండి అబ్బాయిలు (మీరు మరీ బక్కచిక్కిపోయి ఉంటే మాత్రం టైట్ బట్టలు వేయకపొవడమే మంచిది).

* ఇస్త్రీ లేని బట్టలు అంటే చెడ్డ చిరాకు అంట అమ్మాయికి. అదేంటీ ఆఫీసుకి వెళుతున్నామా గర్ల్ ఫ్రెండ్ దగ్గరకి వెళుతున్నామా అని మీరు అడగొచ్చు. కాని అమ్మాయిల మెంటాలిటిని అబ్బాయిలు కనిపెట్టడం కష్టం బాస్ .. బట్టలు ఇస్త్రీ చేసుకునే అలవాటు లేకపోతే వీడికి ఏ విషయం మీద పట్టింపు ఉండదు అనే అభిప్రాయానికి వచ్చేస్తారట.

* మరో విషయం ఏమిటంటే, అమ్మాయిలకి అబ్బాయి షార్ట్ వేసుకుంటే కూడా చిరాకు పుట్టే అవకాశం ఉంటుందట. అలా ఎందుకు అంటే ఏం చెప్తాం .. కాళ్ళకు పెరిగిన వెంట్రుకలని అలా బయటకి చూపిస్తూ తిరిగితే ఆ సైట్ అమ్మాయి కనులకి ఇంపుగా ఉండకపోవచ్చు కదా.

* మీ గర్ల్ ఫ్రెండ్ ని మీరు సిల్లీ ఫెల్లో అని తిట్టుకున్నా, సెల్ ఫిష్ అని తలబాదుకున్నా, తమకి నచ్చని కలర్ అబ్బాయి వేసుకుంటే కూడా అమ్మాయిలకి కోపం వస్తుందట. కొంచెం పెద్ద నోరు ఉన్న గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంత చిన్న విషయానికి కూడా క్లాసు పీకవచ్చు. కాబట్టి మీ గర్ల్ ఫ్రెండ్ కలర్ టేస్టులు ఓసారి తెలుసుకోండి.

* వినడానికి వింతగా ఉన్నా, ఇది సర్వేలు చెప్పిన నిజం. అమ్మాయికి ఒక అబ్బాయి టీషర్ట్స్ లో కన్నా, ఫార్మల్ షర్ట్స్ లోనే ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తాడట. ఫార్మల్ షర్ట్స్ బాయ్ ఫ్రెండ్స్ హాట్ గా కనిపిస్తారని చెబుతున్నారు నేటితరం మగువలు. అతిగా టీ షర్ట్స్ వేస్తే వీరికి కోపం వచ్చేది అందుకే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top