సెక్స్ టూరిజం... ఈ ప్రాంతాలు భలే ఫేమస్!

కొంతమంది ప్రకృతి అందాలను ఆశ్వాదించేందుకు ట్రావెల్ చేస్తారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేందుకు పర్యటిస్తుంటారు. అయితే, కొందరు మాత్రం సెక్స్‌లో కొత్తదనం కోసం వెతుక్కుంటూ పర్యటనలు చేస్తారు. ఇలాంటి వారి కోసం కొన్ని దేశాలు సెక్స్ టూరిజాన్ని ప్రోత్సాహిస్తున్నాయి. మరికొన్ని దేశాల్లో అనుమతి లేకున్నా... టూరిజంలో భాగమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ‘సెక్స్ టూరిజం’ ద్వారా పర్యటకులను ఆకట్టుకుంటున్న పది ప్రాంతాల వివరాలను అందిస్తున్నాం. అవేంటో చూడండి మరి.

డొమినికన్ రిపబ్లిక్ :

కరేబియన్ దేశాల్లో సెక్స్ టూరిజం ఇటీవల బాగా పెరిగింది. సుమారు 60వేల నుంచి లక్ష మంది మహిళలు ఇదే పనిలో ఉన్నారంటే అక్కడ తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దేశాల్లో వ్యభిచారం నేరం కాదు. అయితే, మైనర్లతో వ్యాపారం చేస్తే శిక్ష తప్పదు. కానీ, ఈ వృత్తిలో ఎక్కువ మంది మైనర్లే ఉండటం దురదృష్టకరం.

కంబోడియ :

ఈ దేశంలో వ్యభిచారం నివారణకు కఠినమైన చట్టాలున్నాయి. అయితే, వీటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఒకప్పుడు వ్యభిచారానికి అనుమతి ఉండేది. అయితే.. చిన్నారులను ఈ వృత్తిలోకి బలవంతంగా లాగుతుండటంతో నిషేదం విధించారు. పేదరికం వల్ల చాలా మంది ఇక్కడ ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. పర్యటకులను ఆకర్షిస్తూ పొట్టపోసుకుంటున్నారు. కొందరైతే డబ్బులు కోసం తమ చిన్నారులను అమ్మేసుకుంటున్నారు.

అమస్టర్‌డమ్ :

నెదర్లాండ్స్‌లో సెక్స్ టూరిజానికి పెట్టింది పేరు అమస్టర్‌డమ్. ఇక్కడి రెడ్ లైట్ ఏరియా ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. సెక్స్ షాప్‌లు, పీప్ షోలు, స్ర్టిప్ క్లబ్‌లకు పెట్టింది పేరు. అమస్టర్‌డమ్‌లో వ్యభిచారానికి అనుమతి ఉంది. అయితే, మైనర్లు, చిన్నారులు ఈ వృత్తిలోకి రాకుండా చట్టాలను సక్రమంగా అమలు చేస్తున్నారు. ఆ సుఖం కోసం కనీసం 35 నుంచి 100 యూరోలు వెచ్చించాలి. మైనర్లకు ప్రవేశం నిషేదం.

కెన్యా :

ఇక్కడ పేదరికం నుంచి సెక్స్ టూరిజం ఆవిర్భవించింది. ఇక్కడ చాలా మంది దీన్నే వృత్తిగా చేసుకున్నారు. అయితే, ఇక్కడ హెచ్‌ఐవీ ఎయిడ్స్ కూడా అదే స్థాయిలో ఉంది. ఈ వృత్తిలో ఉండే యువతులు చాలామందికి కండోమ్స్‌పై అవగాహన లేదు. కేవలం 60 శాతం మంది మాత్రమే కండోమ్ ద్వారా సెక్స్‌లో పాల్గొంటున్నారని ఓ సర్వేలో తేలింది. ఇక్కడి విచ్చలవిడి సెక్స్ ఫలితంగా చిన్నారులు సైతం బాల్యంలోనే ఎయిడ్స్ బాధితులు అవుతున్నారు. సెక్స్ టూరిజమే ఈ దేశానికి ఆర్థిక వనరు.

ఫిలిప్పీన్స్ :

ఈ దేశంలో వ్యభిచారం నేరం. ఇందుకు కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నా, సెక్స్ టూరిజం నడుస్తూనే ఉంది. సుమారు 5 లక్షల సెక్స్ వర్కర్లు ఇక్కడ ఉన్నారు. తూర్పు ఆసియా, పశ్చిమ దేశాలకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఈ ప్రాంతాలకు వస్తుంటారు. ఇక్కడి పర్యటకుల్లో 40 నుంచి 60 శాతం మంది కేవలం సెక్స్ కోసమే ఈ దేశానికి వస్తుంటారు.

కొలంబియా :

దక్షిణ అమెరికాలోని ఈ ప్రాంతం డ్రగ్స్, సెక్స్‌కు పెట్టింది పేరు. విటులను ఆకర్షించేందుకు ఇక్కడి సెక్స్ వర్కర్లు తమ ధరలు కూడా తగ్గించేశారు. అంతేగాక, సెక్స్ వర్కర్లు విటులను చక్కగా పలకరించి మంచి సుఖాన్ని ఇస్తారనే ప్రచారంతో ఇక్కడి సెక్స్ టూరిజం బాగా పాపులర్ అయ్యింది.

ఇండోనేషియా

ఇక్కడ వ్యభిచారాన్ని గౌరవం, నైతికతలకు భంగం కలిగించే నేరంగా పరిగణిస్తారు. అయినా సరే, ఇండోనేషియా సెక్స్ టూరిజంలో ముందుండటం గమనార్హం. ఈ వ్యభిచారాలకు ఆన్‌లైన్, సోషల్ మీడియాలే వేదికలు. అయితే, ఈ దేశంలో కూడా మైనర్లను బలవంతంగా వ్యభిచారంలోకి లాగుతున్నారు. అయితే, ఇక్కడి చట్టాలు వారికి ఎలాంటి రక్షణ కల్పించలేక చేతులెత్తేశాయి.

స్పెయిన్ :

ఇబిజ, మద్రిద్, బర్సెలోనా వంటి నగరాలు నైట్ క్లబ్‌లకు పెట్టింది పేరు. ఇక్కడ వ్యభిచారం నేరం కాదు. దీంతో ఈ దేశం ఐరోపాలో సెక్స్ టూరిజానికి కేంద్రమైంది. ఈ నగరాల్లో ఎక్కువ దక్షిణ అమెరికాకు చెందిన సెక్స్ వర్కర్లే అధికం. ఇక్కడ సెక్స్‌కు ఉన్న డిమాండుతో అమ్మాయిలను అక్రమ తరలింపులు కూడా అధిక స్థాయిలో ఉంటాయి.

బ్రెజిల్ :

ఇక్కడి ప్రకృతి అందాలే కాదు, ప్రజలూ ఆకర్షనీయంగా ఉంటారు. నిత్యం ఏదో ఒక పండుగ, కార్నివాల్స్‌తో సందడిగా ఉంటుంది. సెక్స్ టూరిజంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఈ దేశం నిలుస్తోంది. చిత్రం ఏమిటంటే.. ఇక్కడ ఫిమేల్ సెక్స్ టూరిజం ఎక్కువ. మహిళా టూరిస్టులకు ఇది ఫేవరెట్ ప్లేస్. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడి సెక్స్ టూరిజంపై నిఘా ఉంచింది. యువతుల అక్రమ తరలింపులపై చర్యలు తీసుకుంటోంది.

థాయ్‌లాండ్ :

థాయ్... ఈ పేరు వినగానే మసాజ్ గుర్తుకు వస్తుంది. ‘హ్యాంగ్‌వోవర్ పార్ట్ 2’ చూసినవారికి ఈ ప్రాంతం గురించి పరిచయం అక్కర్లేదు. అలాగే మన పూరీ జగన్నాథ్ సినిమాల్లో కూడా థాయ్ మసాజ్‌ ప్రస్తావన ఉంటుంది. థాయ్ సంప్రదాయాల్లో మసాజ్, సెక్స్ అనేవి భాగమని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ సుమారు 3 మిలియన్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. వీరిలో మూడో వంతు మైనర్లే. ఇక్కడ పర్యటకుల తాకిడి పెరిగే కొద్ది, యువతుల అక్రమ తరలింపు ఘటనలు కూడా పెరిగిపోయాయి. అయితే, ఆ దేశంలో మసాజ్, సెక్స్‌లు ఆర్తిక వనరులు కావడంతో ప్రభుత్వం కూడా చూసీ చూడకుండా వదిలేస్తోంది.

చూశారుగా.. అమస్టర్‌డమ్, బ్రెజిల్, ఇండోనేషియా, కొలంబియా మినహా మిగతా దేశాల్లో అత్యధికులు పేదరికం తట్టుకోలేక ఈ వృత్తిలోకి దిగుతున్నారు. అయితే, చిన్నారులు, మైనర్లను సైతం ఈ వృత్తిలోకి లాగడం బాధించే విషయం. కొన్ని దేశాలు వ్యభిచారాన్ని అనుమతించినా, మైనర్లు, చిన్నారులకు రక్షణ కల్పిస్తున్నాయి. అదే తరహాలో మిగతా దేశాలు కూడా వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top