గుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందనేది అపోహ మాత్రమే!

శారీరకంగా కష్టపడే వ్యక్తులు, బాడీ బిల్డర్లు, ఫిట్‌నెట్ మీద దృష్టి సారించే వాళ్లు ప్రొటీన్ కోసం రోజువారీ ఆహారంలో గుడ్లు తిసుకుంటారనేది కేవలం అపోహే. ఎందు కంటే దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డు రోజువారీ ఆహారంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు తగిన మోతాదులో సమకూరుతాయి. రోజు గుడ్లు తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయనడంలో అర్థం లేదు. కండరాల నిర్మాణానికి అవసరమైన కొత్త కణాలను ఉత్పత్తి చేసి, పాతవాటిని మరమ్మత్తు చేయడంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరంలో జీవ క్రియలు సక్రమంగా జరగాలంటే తగిన మొత్తంలో ప్రొటీన్లు అందాలి. గుడ్లు ప్రొటీన్‌లకు ప్రాథమిక వనరు. ఇందులో అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. దీంతోపాటు మాంసం, చేపలు, పాలలోనూ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే గుడ్లు ద్వారా లభించే ప్రొటీన్ అత్యధిక నాణ్యత కలిగినది. మిగతా వాటితో పోల్చుకుంటే చాలా సులువుగా లభ్యమవుతుంది.

గుడ్డు అధిక సంతృప్తి సూచి అంటే తిన్న తర్వాత ఎక్కువ మొత్తంలో తీసుకున్నామనే భావన కలుగుతుంది. అల్పాహారంలో ఇతర పదార్థాల కంటే గుడ్డుతో తయారు చేసిన టోస్ట్‌ను తీసుకుంటే 50 శాతం ఎక్కువ సంతృప్తి సూచి ఉంటుంది. సాధారణ తృణధాన్యాలను అల్పాహారంగా తీసుకున్నవారి కంటే గుడ్లను తీసుకున్న వ్యక్తులే మధ్యాహ్నం భోజనాన్ని 29 తగ్గించి తిన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

రోజువారీ ఆహారంలో గుడ్డు తింటే శరీరానికి అవసరమైన సగానికిపైగా కొవ్వు అందుతుంది. దీని వల్ల రక్తంలో కొవ్వు సాంద్రత పెరుగుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియాతోపాటు ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, కొరియాల్లో రోజువారీ ఆహారంలో కొవ్వు తీసుకోడానికి ఎలాంటి పరిమితి లేదని తేలింది. కరోనరీ గుండె జబ్బులకు రోజువారీ ఆహారం ద్వారా లభించే కొవ్వు కారణం కాదని ఈ నివేదిక బహిర్గతం చేసింది. అయినప్పటికీ

ఇప్పటికే గుండె జబ్బుల బారిన పడ్డ వ్యక్తులు కొలెస్ట్రాల్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేకపోతే సున్నితమైన వ్యక్తులలో చెడు కొవ్వుల స్థాయిని పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్‌ను మంచి కొవ్వుగా పేర్కొంటారు. గుడ్డు తినడం ద్వారా శరీరంలో దీని స్థాయిలు పెరుగుతాయి. అధిక సాంద్రత లిపోప్రొటీన్ ఎక్కువుంటే గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం అంటే స్ట్రోక్, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి. డెన్మార్క్‌లో కొపెహెగన్‌లోని గుండె జబ్బుల నివారణ కేంద్రం లోయిగెరేనెస్ టెస్ట్ సెంటర్ దీనిపై అధ్యయనం చేపట్టింది. ఆరు వారాలపాటు ఆహారం కింద అదనంగా గుడ్లు ఇచ్చి పరిశీలిస్తే హెచ్‌డీఎల్ 10 శాతం పెరిగినట్లు గుర్తించింది. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూట్రిషినల్ సైన్సెస్ అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది.

కేవలం ప్రొటీన్, కొలెస్ట్రాల్‌కు మాత్రమే కాదు, సూక్ష్మపోషకాలకు గుడ్డు ప్రధాన వనరు. రోజూ ఒక గుడ్డు తింటే రోజువారి సిఫార్సు చేసే విటమిన్ ఎ 6 శాతం, ఫోలేట్ 5 శాతం, విటిమిన్ బి5 7 శాతం, విటమిన్ బి12 9 శాతం, బి2 15 శాతం, ఫాస్పరస్ 9 శాతం, సెలీనియం 22 శాతం లభిస్తాయి. పచ్చసొనలోనూ ల్యూటేన్, జెంక్సాంతిన్ వల్ల కంటికి సాధారణంగా వచ్చే కాంటరాక్ట్, మచ్చల సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top