మహిళల్లో పెల్విక్ ఇన్ఫెక్షన్ సమస్యకు నేచురల్ సొల్యూషన్స్

పెల్విక్ ఇన్ఫెక్షన్, లేదా పెల్విక్ ఇంఫ్లేమేటరీ డిసీస్ (PID) అనే ఈ కండిషన్ వలన పెల్విక్ రీజన్ లో నొప్పి కలుగుతుంది. యుటెరస్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్ మరియు పెరిటోనియం వంటి పెల్విక్ ప్రాంతాలలో ఇన్ఫెక్షన్ తలెత్తడం వలన ఈ సమస్య తలెత్తుతుంది. ఫిమేల్ రేప్రొడక్టివ్ ఆర్గాన్స్ లోకి వెజీనా లేదా సెర్విక్స్ ద్వారా బాక్టీరియా చేరినప్పుడు PID సమస్య ఎదురవుతుంది. క్లామైడియ ట్రాకోమాటిస్ మరియు నేయిసిరియా గనేరియా వంటి లైంగిక సంక్రమణ రోగక్రిముల ద్వారా PID సమస్య తలెత్తుతుంది. వెజీనల్ ప్రాంతంలో నివసించే బాక్టీరియా మహిళల రీప్రొడక్టివ్ ఆర్గాన్ వరకు చేరినప్పుడు PID సమస్య ఎదురవుతుందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు, ఈ సమస్యను తగ్గించే సులభమైన హోమ్ రెమెడీస్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. లైంగిక సంక్రమణల వ్యాధుల ద్వారా పెల్విక్ ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ సమస్య మహిళలకి మాత్రమే ఎదురవుతుంది. పురుషుల్లో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే, ఫిమేల్ పెల్విక్ ఆర్గాన్స్ కి మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ ఆర్టికల్ ను చదివి పెల్విక్ ఇన్ఫెక్షన్ ను తగ్గించేందుకు హోంరెమెడీస్ ను ప్రయత్నించండి మరి. ఆరోగ్యకరమైన అలాగే పోషకాలు పుష్కలంగా లభించే డైట్ ను తీసుకోవడం ద్వారా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కలిగే PID సమస్య నుంచి రికవర్ అవవచ్చు. కేల్షియం రిచ్ ఫుడ్స్, స్పినాచ్, కాలే, బ్రొకోలీ, బీన్స్, డైరీ ప్రోడక్ట్స్ మరియు ఆల్మండ్స్ వంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ను తీసుకోవటం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అలాగే, బ్లూబెర్రీస్, చెర్రీస్, టమాటోస్, స్క్వాష్ మరియు బెల్ పెప్పర్ వంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోవటం కూడా మంచిదే. మల్టీవిటమిన్ విటమిన్స్: విటమిన్ ఏ, బీ కాంప్లెక్స్, సీ, ఈ తో పాటు తగు మోతాదులో మెగ్నీషియం, కేల్షియం, జింక్ మరియు సెలీనియంను ప్రతి రోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ద్వారా తీసుకోవటం పెల్విక్ ఇంఫ్లేమేటరీ డిసీస్ కు మంచి రెమెడీగా పనిచేస్తుంది. నిజానికి, ఈ సమస్య తీవ్రతను తగ్గించేందుకు ఈ రెమెడీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే ఆహారాలు: ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే ఆహారాలు ఇంఫ్లేమేషన్ స్థాయిలను తగ్గించేందుకు తోడ్పడతాయి. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ (రోజుకి ఒకటి లేదా రెండు) ని తీసుకోవచ్చు లేదా ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, సాల్మన్, బీఫ్, వ్వాల్నట్స్, టోఫు మైర్యు సార్డీన్ వంటి నేచురల్ ఫుడ్ సోర్సెస్ ను డైట్ లో భాగం చేసుకోవటం ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు. ప్రోబయోటిక్ సప్లిమెంట్స్: 5 నుంచి 10 బిలియన్ల CFU (కాలనీ ఫార్మింగ్ యూనిట్స్) లభించే ప్రోబయాటిక్ సప్లిమెంట్ ను రోజుకొకసారి తీసుకుంటే గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఆరోగ్యం అలాగే ఇమ్మ్యూన్ సిస్టమ్ పనితీరు మెరుగ్గా ఉంటాయి. తద్వారా, PID సమస్యను అరికట్టవచ్చు. గ్రేప్ ఫ్రూట్ సీడ్ ఆయిల్ (సిట్రస్ పరదీసి): రోజుకు 100 ఎం.జీ గ్రేప్ ఫ్రూట్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్ ను తీసుకోవచ్చు లేదా అయిదు లేదా పది చుక్కల ఆయిల్ ను పానీయంలో కలుపుకోవచ్చు. రోజుకొకసారి ఈ విధంగా తీసుకోవటం ద్వారా ఇమ్మ్యూన్ సిస్టమ్ పనితీరు మెరుగవుతుంది. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉండటం వలన ఇంఫ్లేమేషన్ పై పోరాటం జరుగుతుంది. ఇది పెల్విక్ ఇన్ఫెక్షన్ ను తగ్గించే అద్భుతమైన హోమ్ రెమెడీ. గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లభిస్తాయి. రోజుకు 250 నుంచి 500 ఎం.జీ స్టాండర్డైజ్డ్ ఎక్స్ట్రాక్ట్ ను తీసుకోవాలి. తద్వారా, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ పై పోరాటం జరపవచ్చు. ఈ విషయాన్ని ఒక స్టడీ కన్ఫర్మ్ చేసింది. హ్యూమన్ గామా డెల్టా టీ సెల్స్ రికగ్నైజ్ అల్క్యలమిన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ మైక్రోబ్స్, ఎడిబుల్ ప్లాంట్స్ అండ్ టీ, ఇంప్లికేషన్స్ ఫర్ ఇన్నెట్ కమ్యూనిటీ అనే స్టడీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రీషి మష్రూమ్: ఈ మష్రూమ్ అనేది ఇమ్యూనిటీ ను పెంపొందించి ఇంఫ్లేమేషన్ పై పోరాటం జరుపుతుంది. 150-300 ఎం.జీ ఎక్స్ట్రాక్ట్ ను రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ఇది పెల్విక్ ఇంఫ్లేమేటరీ డిసీజ్ ను తగ్గించే సమర్థవంతమైన హోంరెమెడీ. క్యాస్టర్ అయిల్: క్యాస్టర్ అయిల్ అనేది పెల్విక్ ఇన్ఫెక్షన్ వలన ఎదురయ్యే క్రామ్ప్స్ మరియు అసౌకర్యాన్ని తొలగించేందుకు తోడ్పడుతుంది. ఒక వస్త్రాన్ని క్యాస్టర్ ఆయిల్ లో ముంచి ఆ వస్త్రాన్ని పొత్తికడుపుపై వ్రాప్ చేయాలి. దీనిపై హీటింగ్ ప్యాడ్ ను దాదాపు 30 నిమిషాల పాటు అమర్చాలి. ఈ పద్దతిని వరసగా మూడు రోజులు పాటిస్తే నొప్పి తగ్గిపోతుంది. గార్లిక్: గార్లిక్ లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలవు. ఇవి పెల్విక్ ఇన్ఫెక్షన్, వెజీనల్ డిశ్చార్జ్ అలాగే వెజినైటిస్ ను తగ్గించేందుకు ప్రభావవంతమైన హోమ్ రెమెడీస్ లా పనిచేస్తాయి. ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను ఒక గ్లాసుడు నీళ్లతో ఖాళీ కడుపుతో ఉదయాన్నే తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. పెల్విక్ ఇన్ఫెక్షన్ ను తగ్గించేందుకు ఇది గొప్ప రెమెడీగా పనిచేస్తుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top