ప్రేమ లో సందేహమా

త‌ల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకొని జీవితాంతం గ‌డిపేయం అనేదానికి కాలం చెల్లింది. మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ పెర‌గ‌డంతో ఎక్కువ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోగ‌లుగుతున్నారు. మ‌రో వైపు మ‌గ‌వారు ఎప్పుడూ డేటింగ్‌కు సై అనేస్తున్నారు.

దీనికి తోడు స‌హ‌-జీవ‌న సంబంధాల ప‌ట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నారు. స‌మాజం కూడా ఇప్పుడు దీన్ని పెద్ద త‌ప్పుగా భావించ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో గ‌త‌కాల‌పు జ్ఞాప‌కాల‌ను ర‌హ‌స్యంగా దాచిపెట్టాలా లేక భాగ‌స్వామికి బ‌హిర్గ‌తం చేయాలా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

సంబంధంలో కొన‌సాగే జంట‌లు ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకోవ‌డ‌మ‌న్న‌ది వారి మ‌ధ్య మ‌రింత ద‌గ్గ‌రిత‌నాన్ని తీసుకువ‌స్తుంది. ఐతే అన్ని బంధాలు అలాంటి ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు ఎల్ల‌కాలం నిల‌వ‌లేవు. ఏదో ఒక కార‌ణంతో బ్రేక‌ప్ చెప్పే జంట‌లు కోకొల్ల‌లుగా క‌నిపిస్తుంటాయి.

కొత్త సంబంధాన్ని వెతుక్కున్న‌ప్పుడు పాత‌వి చేదు జ్ఞాప‌కంలా మ‌దిలో నిలిచిపోతాయి. ఇప్పుడు అస‌లు స‌మ‌స్య ఏమిటంటే కొత్త భాగ‌స్వామితో పాత వారి గురించి చ‌ర్చించ‌డం అవ‌స‌ర‌మా లేదా అన్న‌దే పాయింటు. అందుకు కార‌ణాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

1. మాజీకి గౌర‌వం కార‌ణ‌మేదైనా బంధాన్ని తెంచుకుంటే ఆ వ్య‌క్తిని అప్పుడు ప్రేమించార‌న్న‌ది వాస్త‌వం. ఈ ఒక్క కార‌ణం చాలు వారి ప‌ట్ల గౌర‌వభావం ఉండ‌డానికి. మీ మ‌ధ్య ఉన్న ర‌హ‌స్యాలకు క‌నీస మ‌ర్యాద ఇవ్వాలి. అది చాలు క‌ల‌కాలం ఉంచుకోవ‌డానికి.

2. ప్రైవ‌సీ ముఖ్యం ఇద్దరు వ్య‌క్తులు క‌లిసున్నంత మాత్రాన వారి వ్య‌క్తిగ‌త స్వాతంత్రాన్ని హ‌రించ‌లేం క‌దా. కొన్ని విష‌యాలు వ్య‌క్తిగ‌త‌మై ఉంటాయి. వాటిని అలాగే ఉంచ‌డం మేలు. మీ భాగ‌స్వామి మీ గురించి అన్ని విష‌యాలు తెలుసుకోవాల‌నే రూల్ ఏమీ లేదు. మీ గ‌త కాల‌పు చ‌రిత్ర ఇందులో ఒక‌టి.

3. అది వారిని గాయ‌ప‌ర్చ‌వ‌చ్చు మీ ద‌గ్గ‌రున్న ర‌హ‌స్యాలు మీ భాగ‌స్వామికి తెలిస్తే బాధ‌ప‌డే అవ‌కాశ‌ముంది. సాధ్య‌మైనంత మేర‌కు చెప్ప‌క‌పోవ‌డ‌మే మంచిది. గాయ‌ప‌ర్చేవైతే అస్స‌లు వ‌ద్దు. కొన్ని విష‌యాలు చ‌ర్చించ‌క‌పోవ‌డ‌మే మంచిది.

4. చిన్న‌గా చేసి మాట్లాడే అవ‌కాశం మీ మాజీ గురించి చిన్న‌గా చేసి మాట్లాడ‌టం మీకు బాధ క‌లిగించొచ్చు. గ‌తంలో మాజీ వ‌ల్ల మీరు బ‌లైన సంద‌ర్భాలుంటే అదే అవ‌కాశంగా ప్ర‌స్తుత మీ భాగ‌స్వామి మిమ్మ‌ల్ని కించ‌ప‌రిచి మాట్లాడే అవ‌కాశం ఉంది. అందుకే ఇలాంటి బాధ‌ల‌న్నీ లేకుండా సాధ్య‌మైనంత వ‌ర‌కు మాజీ గురించి చ‌ర్చించ‌క‌పోవ‌డ‌మే మంచిది.

5. న‌మ్మ‌కం పోవ‌చ్చు ఏ సంబంధ‌మైనా న‌మ్మ‌కంపైనే న‌డుస్తుంది. మీ భాగ‌స్వామి మీరేదో ర‌హ‌స్యాల‌ను దాచిపెడుతున్నార‌ని భావిస్తే వాళ్లకి అది న‌చ్చ‌దు. న‌మ్మ‌కం అనే పునాదిరాయిని మీ భాగ‌స్వామి ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంది. దీంతో మీ ప్ర‌స్తుత సంబంధం చెడిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top