చలికాలం లో మీ ముఖం పొడివారకుండా ఉండాలంటే ఇలా చేయండి

పెదాలు: లిప్‌స్టిక్‌ వేసుకోవడానికి ముందు పెదాలకు క్రీం రాసుకోవాలి. అప్పుడే అది చాలాసేపు అంటిపెట్టుకుని ఉంటుంది. పెదాలూ పొడిబారడం తగ్గి మృదువుగానూ ఉంటాయి. రంగు వేసుకున్న తర్వాత లిప్‌గ్లాస్‌ అద్దుకోవడం మరిచిపోకూడదు. కొద్దిమందికి ఈ కాలంలో లిప్‌స్టిక్‌ వేసుకోవడం ఇష్టం ఉండదు. వీరు లిప్‌బామ్‌ను రాసుకున్నా పెదాలు తాజాగా, మృదువుగా ఉంటాయి.

మస్కారా

: మీకు ఇష్టం ఉన్న రంగులను ఈ కాలంలో నిరభ్యరంతరంగా వేసుకోవచ్చు. అది నీలం, ముదురు మావిచిగురు లాంటి రంగులైనా సరే.

ఐలైనర్‌

: కళ్లకి మరింత అందాన్నిచ్చే దీన్ని కూడా రకరకాల రంగుల్లో ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడూ వాడే నలుపుని పక్కన పెట్టి నీలం, ఆకుపచ్చ చాక్లెట్‌ బ్రౌన్‌ రంగులని ఈ కాలంలో ప్రయత్నించి చూడండి. అప్పుడు కావాలనుకుంటే పెదాలకు లేత రంగు లిప్‌స్టిక్‌ వేసుకోండి.

ఐ షాడో

: ఈ చల్లటి కాలంలో చమక్కున మెరిసే ఐ షాడోలు బాగుంటాయి. వెండి రంగు ఐ షాడోలు మీకు మరింత అందాన్నిస్తాయి.

చెంపలకు

: ఈ కాలంలో చెంపలకు వేసుకునే బ్రాంజర్‌ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అది ద్రవరూపంలో ఉండేలా చూసుకోవాలి.

గోళ్లరంగు

: ఈ కాలంలో ముదురు రంగులకే ప్రాధాన్యమివ్వాలి. ముదురు చాక్లెట్‌ రంగు, నీలం మీ అందమైన గోళ్లను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top