ఆరోగ్యకరమైన ఆహారం

మంచి పోషకాహారం తీసుకున్నాం ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు ఆరోగ్యానికి హానికరం! అంటే చేయకూడనివి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకాల్సిందే.

పండ్లతో పొట్ట ముందుకు!

భోజనం చేసేముందు కానీ, చేశాక కానీ, ఆబగా పండ్లు తినకూడదు. పొట్ట పెరుగుతుంది. రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి.

టీకి టాటా చెప్పండి!

వెంటనే టీ తాగితే భోజనం జీర్ణమవదు. తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.

తిన్నాక స్నానం వద్దు!

తినగానే స్నానం చేయవద్దు. కాళ్లు, చేతుల్లోకి ర క్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.

గంట తరువాతే!

భోజనం చేసి పదడుగులు వేస్తే నిండు నూరేళ్లు జీవిస్తారని చెపుతుంటారు. కానీ భోజనం చేయగానే నడిస్తే పోషకాలను గ్రహించటంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తప్పదనుకుంటే గంట తరువాత నడవండి.

భోజనానికీ నిద్రకు మధ్య వ్యవధి!

తినగానే వెంటనే పక్కమీద కు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top