జుట్టురాలే సమస్యకు కరివేపాకు

పొడవైన,అందమైన జుట్టు మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే అందమైన జుట్టును నిర్వహించటం అనేది మహిళలకు చాలా పెద్ద సవాలుగా మారుతుంది. పొడవైన,మెరిసే అందమైన జుట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యల నుండి బయట పడటం చాలా కష్టంగా మారింది. ఆరోగ్యమైన,బలమైన జుట్టు నిర్వహణకు కొన్ని సాదారణ ఇంటి నివారణలు ఉన్నాయి. జుట్టు సమస్యల పరిష్కారానికి కరివేపాకు బాగా సహాయపడుతుంది. కరివేపాకులో బీటా - కెరోటిన్ మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు నష్టం మరియు జుట్టు పల్చబడటంను నిరోధిస్తుంది.

1. కరివేపాకుతో కొబ్బరి నూనె

కరివేపాకుతో కొబ్బరి నూనె కలిస్తే జుట్టు పెరుగుదలలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒక గిన్నెలో కరివేపాకు,కొబ్బరి నూనె వేసి కరివేపాకు నల్లగా అయ్యేవరకు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద నుంచి దించి చల్లారాక జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు ఒక నెల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

2. పెరుగు మరియు కరివేపాకు

పెరుగు,కరివేపాకు మిశ్రమం జుట్టు పెరుగుదలలో మంచి పలితాలను ఇస్తుంది. మొదట కరివేపాకును మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో మూడు స్పూన్ల పెరుగును వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని తల మీద చర్మం మీద రాసి అరగంట తర్వాత తెలికప్తి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు పొడవుగా మరియు మెరుస్తుంది.

3. కరివేపాకు మరియు కలబంద

జుట్టు రాలే సమస్యను కరివేపాకు కలబందతో కలిసి పరిష్కరిస్తుంది. ఇది జుట్టు రాలే సమస్యకు అద్భుతమైన పలితాన్ని ఇస్తుంది. కరివేపాకు పేస్ట్ లో కలబంద జెల్ కలిపి తల మీద చర్మానికి రాసి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

4. వేడి పాలు మరియు కరివేపాకు

జుట్టు కోల్పోవడం అనేది అత్యంత సాధారణ సమస్యలలో ఒకటిగా ఉన్నది. ఇది ముఖ్యంగా కాలుష్యం కారణంగా సంభవిస్తుంది. వేడి పాలలో కరివేపాకు ఆకులను వేసి తల మీద చర్మానికి రాసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇది చుండ్రును నిరోధించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

5. కరివేపాకు మరియు వేడి నీరు

కరివేపాకు,నీటితో కలిసి జుట్టు పెరుగుదలలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. రెండు కప్పుల నీటిని తీసుకోని బాగా మరిగించాలి. ఆ మరిగే నీటిలో ఒక కప్పు కరివేపాకు ఆకులను వేసి మరిగించాలి. తలస్నానం చేసాక పైన తయారుచేసుకున్న మిశ్రమంతో జుట్టును కడగాలి. ఈ విధంగా చేయుట వలన జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది.

6. ఆహారంలో కరివేపాకును చేర్చాలి

కరివేపాకు వంటలకు మంచి రుచిని ఇస్తుంది. ఈ ఆకును భారతీయులు వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కరివేపాకు వంటలకు రుచిని ఇవ్వటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఆహారంలో కరివేపాకుని ఒక బాగంగా చేసుకుంటే అనేక జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top