షైనీ, సిల్కీ, స్మూత్ హెయిర్ ను ఈ ఆయిల్ రెమెడీస్ తో పొందండి

భారతీయ మహిళలు శిరోజాల పోషణకై నూనె పట్టించడమనే విధానాన్ని కొన్ని తరాల నుంచి వాడుతున్నారు. శిరోజాల సమస్యలు ఎదురైన ప్రతిసారి నూనె పట్టించాలన్న సలహా పెద్దవాళ్ళ నుండి వస్తుంది. ఇది సహజమే. నూనెని అప్లై చేయడం వలన హెయిర్ ప్రాబ్లెమ్స్ తగ్గిపోతాయన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే, శిరోజాలకు పోషణనిచ్చే మంచి ఆయిల్స్ గురించి వాటిని వాడే విధానం గురించి ఈ రోజు మీకు వివరిస్తాము. ఆయిలింగ్ అనేది శిరోజాలకు ఎంతగానో ప్రయోజనకారిగా ఉంటుంది. హెయిర్ ను కండిషన్ చేయడం ద్వారా ఫ్రిజ్ హెయిర్ సమస్య తగ్గుతుంది. స్కాల్ప్ ని వెచ్చటి నూనెతో మసాజ్ చేయడం ద్వారా స్కాల్ప్ పై బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది. తద్వారా, హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది. హెయిర్ ఆయిల్స్ అనేవి అన్ని రకాల హెయిర్ కు పోషణనిస్తాయి. ఆయిలీ హెయిర్ కానివ్వండి లేదా డ్రై హెయిర్ కానివ్వండి హెయిర్ ఆయిల్ ను వాడటం ద్వారా శిరోజాలకు తగిన పోషణ అందుతుంది. అయితే, వాటిలో మరికొన్ని పదార్థాలను జతచేయడం ద్వారా హెయిర్ ఫాల్ మరియు డాండ్రఫ్ వంటి వివిధ హెయిర్ రిలేటెడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. హెయిర్ ఆయిల్స్ కి సంబంధించిన ముఖ్య విషయం ఏంటంటే వీటిని సులభంగా వాడవచ్చు. అలాగే, ఇవి ఖరీదైనవి కాదు కూడా. కాబట్టి, ఇక్కడ కొన్ని హెయిర్ ఆయిల్ మిక్స్ ల గురించి వాటిని వాడే విధానం గురించి వివరించాము. వీటిని తెలుసుకుని మీ శిరోజాల ఆరోగ్యాన్ని అలాగే సౌందర్యాన్ని సంరక్షించుకోండి మరి. కొబ్బరి మరియు వేప: మీరు కాసిన్ని వేపాకులను కొబ్బరి నూనెలో వేడిచేయాలి. ఆకులు బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటిని వడగట్టాలి. లేదా కాస్తంత వేపనూనెను కొబ్బరినూనెలో కలపాలి. ఈ ఆయిల్ రూమ్ టెంపరేచర్ కు చేరగానే స్కాల్ప్ పై ఈ ఆయిల్ తో మసాజ్ చేయాలి. వేప అనేది క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఇది అంతర్లీనంగా ఉన్న స్కాల్ప్ కండిషన్స్ ను తగ్గిస్తుంది. దీని ద్వారా హెయిర్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం: ఆలివ్ ఆయిల్ అనేది చిక్కటి నూనె. ఇది ఫ్రిజ్జీ హెయిర్ సమస్యకు చక్కటి పరిష్కారం. కాస్తంత నిమ్మరసాన్ని ఆలివ్ ఆయిల్ లో కలిపితే హెయిర్ కు డీప్ క్లీన్సింగ్ ఎఫెక్ట్ వస్తుంది. నిమ్మరసంలో స్కాల్ప్ పై పిహెచ్ లెవల్స్ ని బాలన్స్ చేసే సామర్థ్యం కలదు. తద్వారా స్కాల్ప్ పై ప్రోడక్ట్ బిల్డ్ అప్ ను తొలగిస్తుంది. దీంతో పాటు, స్కాల్ప్ దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. మీరు తరచూ షాంపూ చేసుకుంటున్నా కూడా స్కాల్ప్ దుర్వాసన సమస్య వేధిస్తూ ఉన్నప్పుడు ఈ రెమెడీను పాటించండి. క్యాస్టర్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె: క్యాస్టర్ ఆయిల్ చిక్కగా ఉంటుంది. దీనిని డైల్యూట్ చేసి వాడుకుంటే సౌకర్యంగా ఉంటుంది. డైల్యూట్ చేయకుండా దీనిని వాడితే హెయిర్ జిడ్డుగా మారుతుంది. హెయిర్ గ్రోత్ వేగవంతంగా ఉండాలని కోరుకునే వాళ్లకు క్యాస్టర్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది హెయిర్ ను ఒత్తుగా చేస్తుంది. హెయిర్ వాల్యూమ్ ని పెంచుతుంది. ఈ ఆయిల్స్ ను కలిపి వారానికి ఒకసారి వాడితే కేవలం ఒకే నెలలో గుర్తించదగిన హెయిర్ గ్రోత్ ని మీరు గమనించగలుగుతారు. కొబ్బరి నూనె మరియు టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు కలవు. యాక్నే ట్రీట్మెంట్ కై దీనిని ఎక్కువగా వాడతారు. యాక్నేకు దారితీసే బాక్టీరియాను నశింపచేసేందుకు ఈ ఆయిల్ తోడ్పడుతుంది. స్కాల్ప్ యాక్నే సమస్యతో మీరు ఇబ్బందిపడుతున్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ ను కొబ్బరి నూనెలో కలిపి స్కాల్ప్ పై మసాజ్ చేయండి. రాత్రంతా ఇలా ఉంచితే స్కాల్ప్ యాక్నే తగ్గిపోతుంది. డాండ్రఫ్ తో ఇబ్బంది పడే వారికి ఈ రెమెడీ చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. కాబట్టి, మీరు ఈ ఆయిల్ కాంకోక్షన్స్ ను పాటించి మీ హెయిర్ ప్రాబ్లెమ్స్ ను తగ్గించుకుంటారని ఆశిస్తున్నాము. బోల్డ్ స్కై ను ఫాలో చేసి మరిన్ని అప్డేట్స్ ను తెలుసుకోండి మరి!

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top