జలుబు,గొంతు నొపికి అద్భుతమైన చిట్కా

రుతువు ఏదైనా, జలుబు, గొంతునొప్పి చాలా చికాకుగా, నొప్పిగా, దైనందిక పనులకు అడ్డంగా పరిణమిస్తాయి.

పైగా, జలుబు, గొంతునొప్పులకు చేసే చికిత్స ప్రభావం చూపటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అదీ మనకు బలమైన రోగనిరోధక శక్తి లేకపోతే, బ్యాక్టీరియా మరింత విజృంభించి మరింత సమయం పట్టవచ్చు ! రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోటం ముఖ్యం మరియు ఇలాంటి రోగాలను త్వరగా నయం చేసుకోవడం మంచిది.

వైద్యులు జలుబు, గొంతునొప్పులకు చికిత్సగా కొన్ని యాంటీబయాటిక్స్ సూచిస్తారు.

ఈ స్థితిలో ఒక సహజ ఇంటి చిట్కా కూడా పనిచేస్తుంది. అది ఏంటో చూడండి.

కావాల్సిన వస్తువులు

• బ్రౌన్ షుగర్ -1 చెంచా

• లవంగాలు- 4-5

• తులసి ఆకులు -5-6

• పసుపు -1 చెంచా

ఈ సహజ చిట్కా జలుబు, గొంతునొప్పులను, తరచుగా వాడితే బాగా తగ్గిస్తుందని చాలా ప్రచారంలో ఉంది.

అదేకాక, మీరు వెచ్చగా ఉండటం, నూనె వస్తువులకు దూరంగా ఉండటం, పరిశుభ్రంగా ఉండటంతో, ఇలా జలుబు, గొంతునొప్పి ఎక్కువ ఉన్న సమయంలో మరింత ముదరకుండా చూసుకోవడం ముఖ్యం.

మీ లక్షణాలు మరింత ఎక్కువగా ఉండి, జ్వరం, కీళ్ళనొప్పులు కూడా ఉంటే, వెంటనే వైద్యున్ని సంప్రదించటం మంచిది. వైరల్ ఫ్లూ కూడా కావచ్చు.

బ్రౌన్ షుగర్, లవంగాలు, పసుపు, తులసిల మిశ్రమంలోని వాపును తగ్గించే లక్షణాల వల్ల జలుబు, గొంతునెప్పికి అద్భుతమైన సహజ చికిత్సగా పనిచేస్తుంది.

దాంతోపాటు, ఈ చిట్కా జలుబు, గొంతునెప్పి తెప్పించే బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది.

తయారీ విధానం

• అన్ని వస్తువులను నీటిలో వేసి, మరిగించండి.

• జల్లెడపట్టి కేవలం ద్రవాన్ని వేరుచేయండి.

• ఒక కప్పులో పోయండి.

• వేడిగా ఉన్నప్పుడే దీన్ని తాగండి.

జలుబు లేదా గొంతునెప్పి ఉన్నప్పుడు దీన్ని రోజుకి ఒకసారి తాగవచ్చు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top