ఎలా చేస్తే రోజంతా ఉల్లాసమే

* వ్యాయామం మీ దినచర్యలో భాగం కావాలి. అయితే రోజూ ఒకేరకమైనవి చేస్తుంటే విసుగొచ్చి మానేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే తరచూ మార్చండి. నడక, పరుగు, సైకిల్‌ తొక్కడం, తాడాట వంటివి ఎంచుకుని చూడండి. అలాగే రకరకాల వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో ఉంటున్నాయి. వాటిని ప్రయత్నిస్తే ఉత్సాహంగా అనిపిస్తుంది.

* రోజులో ఏ పనులు చేయాలో ముందుగానే పట్టిక సిద్ధం చేసుకోవాలి. ఉదయం లేచినప్పటి నుంచి వాటిని అమలు చేస్తే అనుకున్న సమయం కన్నా ముందుగానే అన్నీ పూర్తవుతాయి. దాంతో మీకు ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు.. మిగిలిన సమయాన్ని మీ వ్యక్తిగత అభిరుచుల కోసం వాడుకోవచ్చు.

* నిరాసక్తిగా ఉండేవారి కన్నా నిత్యం నవ్వుతూ సంతోషంగా ఉండేవారే అధికంగా జీవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. నవ్వడం వల్ల శరీరం నుంచి మంచి హార్మోన్లు విడుదల అవుతాయట.సమయం దొరికితే నవ్వు తెప్పించే వీడియోలు చూసేందుకు ప్రయత్నించండి. అదేవిధంగా ఉదయం లేచినప్పటి నుంచి ఉత్సాహంగా ఉంటే.. రోజంతా సంతోషంగా గడుస్తుంది. అందుకే ఎదురుపడిన వారిని నవ్వుతూ పలకరించాలి. కుటుంబసభ్యులకు ఆ నవ్వే ఆహ్లాదంగా అనిపిస్తుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top