పిల్లలు పుట్టాలంటే ఎప్పుడు కలవాలి?

చాల మంది స్త్రీలు పెళ్లి అవ్వగానే పిల్లలు పుట్టేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటారు. అయితే ఇటీవల పెరుగుతున్న అనేక వ్యాధుల వల్ల , ఇన్ ఫెక్షన్స్, థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీస్, ట్యూబల్ బ్లాక్స్, నెలసరి సమస్యలు , అండం సరిగా రాకపోవడం ఇలాంటి అనేక కారణల వల్ల గర్భం దాల్చడం చాలా కష్టంగా మారింది. అసలు గర్భం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది అనే అవగాహన చాలా మందికి లేదని చెప్పాలి.

స్త్రీలో ఫలదీకరణ రోజులు అంటే, అండోత్సర్గం జరిగే రోజు మరియు ఆ రోజుకు ముందు అయిదు రోజులు అని చెప్పాలి. మరి ఈ ఆరో రోజులలో కనుక రతిక్రీడ తరచుగా సాగిస్తే, మహిళ గర్భవతి అవటం ఖాయం అని చెప్పాలి. మరి ఈ ఆరు రోజుల కాలంలో ఎంత తరచుగా రతి చేయాలి? ప్రతిరోజూ చేయాలా? లేక రెండు రోజులకొకసారి చేయాలా? లేక మహిళ శరీరంలో ఉష్ణోగ్రత పెరిగినపుడు చేయాలా? ఈ ఆరు రోజులలోను సరైన సమయం ఏది అనేది చాలా మందిలో ఉండే అపోహ.

గర్భం రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కలవాలి? ఇది ఇంకొందరి ప్రశ్న...! వీటన్నింటికి ఒక్కటే సమాధానం గర్భదారణ గురించి తెలుసుకోవడమే. సాధారణంగా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది. దీనినే భారతీయ ప్రమాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గొనడం వలన గర్భదారణ జరుగే అవకాశాలు చాలా ఎక్కువ.

మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు, మహిళలలో వీడుదలయ్యే అండంతో కలసి పిండంగా మారుతాయి. దీనినే గర్భదారణ అని అంటారు. ఈ సమయంలో తప్ప మరెపుడు గర్భదారణ కాదా? అని ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కొందరిలో ముందుగా గర్భదారణ జరిగే అవకాశం కూడా ఉంది. ఇది చాలా తక్కువగా జరుగుతుంది. ఇలాంటి సంఘటనలలో 8 నుంచి 10 రోజుల లోపు అండం విడుదలవుతుంది. దీనిని ముందస్తు గర్భదారణ అంటారు. గర్భం పొందడానికి స్త్రీ, పురుషుల ఆరోగ్య స్థితిగతులు, సమయం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..

1. ఆ రోజుల్లో సెక్స్ జరిపినా గర్భం వచ్చే అవకాశాలు తక్కువ:

గర్భవతి త్వరగా అవ్వాలంటే, ఫలదీకరణ జరిగే ఈ ఆరు రోజులలో రతిక్రీడ ఆచరించాలి. ప్రతి రుతుక్రమంలోను 5 నుండి 6 రోజులు మాత్రమే అందుకు అనుకూలంగా వుంటాయి. ఈ సమయానికి ముందుగా లేదా ఈ సమయం అయిపోయిన తర్వాత కనుక రతిక్రీడ ఆచరించినప్పటికి గర్భం వచ్చే అవకాశం లేదు.

2. ఫెర్టిలిటి డేస్ :

అండోత్సర్గం అంటే అండం విడుదల అయిన ఒకటి లేదా రెండు రోజులలోనే రతి చేయాలి. అండం విడుదల ఎల్లపుడూ ఒకే రకంగా వుండదు. మహిళలు తమ రుతుక్రమ సైకిల్ ను ఖచ్చితంగా ఆచరించలేరు. కనుక అండం విడుదల అయిన మూడవ రోజు రతి ఫలితాలనివ్వదు. మహిళల రుతుక్రమంలో అండం ఏ సమయంలో అయినా రిలీజ్ కావచ్చు.

3. ఫెర్టిలిటి కిట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి:

అండం విడుదలను సూచించే కిట్ లు నేడు మార్కెట్ లో లభ్యంగా వున్నాయి. అవి పాజిటివ్ సూచించేటంతవరకు వుంటే, అప్పటికే మీలో అండం విడుదల జరిగిపోయి అవకాశాలు తక్కువగా వుంటాయి. మరి శరీర ఉష్ణోగ్రత అధికమయ్యే వరకు కూడా వేచి వుండకండి. అండం విడుదలైన మూడోరోజున కాని శరీర ఉష్ణోగ్రత అధికం అవదు.

4. ఈ ఫలదీకరణ సమయంలో ఎంత తరచుగా రతి చేయాలి?

ఫలదీకరణ జరిగే రోజులలో గతంలో రోజు విడిచి రోజు చేయాలనేవారు. కానీ స్టడీల మేరకు మీరు కనుక ప్రతిరోజూ రతిని ఆచరించినట్లయితే, అతని వీర్యకణాల సంఖ్య సరైన రీతిలో వుంటే, ఈ ఫలదీకరణ జరిగే 4 లేదా 5 రోజులు, మరియు అండం విడుదల అయ్యే రోజు రతి చేయాలి.

5. ఈ సమయంలో పురుషుడిలో వీర్యం తగ్గితే?

అయితే ఆ సమయంలో పురుషుడికి కనుక వీర్యం సరిగా లేకుంటే, గతంలో చెప్పినట్లు, రోజు విడిచి రోజు చేస్తే కూడా మహిళ గర్భం ధరించే అవకాశానికి సరిపోతుంది.

6. ప్రెగ్నెన్సీ ప్లాన్ లో ఉన్నప్పుడు వారానికి రెండు మూడు సార్లు సెక్స్ :

గర్భం రావాలని ప్రయత్నించే జంటలు రెగ్యులర్ గా వారానికి రెండు లేదా మూడు సార్లు రతిలో పాల్గొనాలి. ఎందుకంటే, మీలో అండం విడుదల ఎపుడు జరుగుతుందో తెలియదు కనుక.

7. రీసెర్చ్: మహిళ గర్భం ధరించాలంటే, పురుషుడిలో వీర్యం కూడా తగినంతగా వుండాలి

ఫలదీకరణ జరిగే రోజులలో ప్రతిరోజూ చేస్తే 37 శాతం, రోజు విడిచి రోజు చేస్తే 33 శాతం, ఒకే సారికనుక చేస్తే 15 శాతంగా మహిళ గర్భం ధరించే అవకాశాలుంటాయని రీసెర్చి చెపుతోంది. మహిళ గర్భం ధరించాలంటే, పురుషుడిలో వీర్యం కూడా తగినంతగా వుండాలి. తగినన్ని వీర్య కణాలుండాలి. అపుడే గర్భం ధరించటం సాధ్యం అవుతుంది.

8. రోజూ రతి ఆచరించటం వల్ల వీర్యం తగ్గుతుంది:

కొన్ని మార్లు ప్రతిరోజూ రతి ఆచరించటం వలన తగినంత వీర్యం లేక గర్భం ధరించే అవకాశం వుండదు. కనుక ఫలదీకరణ రోజులలో పురుషుడు కూడా వీర్యాన్ని పొదుపుగా వాడుకోవాలి.

9. గర్భం ఎన్నాళ్ళుంటుంది ?

సాధారణంగా గర్భదారణ సమయం నుంచి ప్రసవించే వరకూ 40 వారాల (9నెలల 10 రోజలు) కాలపరిమితిలో మహిళను గర్భవతి అంటారు. ఈ గర్భదశను మూడు దశలుగా విభజిస్తారు. మొదటి 12 వారాలను ఒకటోదశగానూ, 13-27 వారాలను రెండో దశగానూ, 28-40 వారాల కాలపరిమితిని మూడో దశగా పరిగణిస్తారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top