మెగా డైరెక్టర్ తో మంచు మనోజ్

మెగా ఫ్యామిలీతో దర్శకుడు వివి వినాయక్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి తన కం బ్యాక్ మూవీ కోసం ఈయననే దర్శకుడిగా ఎంచుకున్నాడు. తనకు నాయక్ లాంటి మూవీ ఇచ్చిన వినాయక్ పై.. రామ్ చరణ్ కి కూడా గురి ఎక్కువే. అందుకే మాస్ డైరెక్టర్ అయిన ఈయనను.. మెగా డైరెక్టర్ అని పిలుచుకుంటారు మెగాభిమానులు.

ఇప్పుడీయన ట్రెండ్ మార్చి మొదటిసారిగా మంచు కాంపౌండ్ లో ఎంటర్ అవుతున్నాడని తెలుస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత వినాయక్ డైరెక్షన్ లో సినిమా అంటూ.. సాయిధరం తేజ్.. గోపీచంద్ ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అవేవీ సాధ్యం కాలేదని.. ప్రస్తుతం మంచు మనోజ్ తో సినిమా చేసేందుకు వినాయక్ రెడీ అవుతున్నాడని అంటున్నారు. వీరిద్దరి మధ్యా స్టోరీ డిస్కషన్స్ కూడా ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చేశాయట. బడ్జెట్ సంబంధించి ప్రస్తుతం మాటామంతీ జరుగుతున్నాయని అంటున్నారు.

మాస్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన వివి వినాయక్ తో సినిమా చేయడం.. మనోజ్ కెరీర్ కు ప్లస్ కానుంది. తాజాగా గుంటూరోడు అంటూ మాస్ మూవీతో మెప్పించినా.. వసూళ్లు మాత్రం రాలేదు. కానీ వినాయక్ సినిమా అంటే స్టార్ డైరెక్టర్ బ్రాండింగ్ ఉంటుంది కాబట్టి.. మంచు హీరోకు ప్లస్ పాయింట్ అని చెప్పాల్సిందే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top