విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు సిద్ధం

‘10 ఎన్రదుకుళ్ల’... అంటే తెలుగులో పది లెక్కపెట్టే లోపు అని అర్థం. అయితే పది అంకెలు దేనికి లెక్కపెట్టాలి? ఆ టైమ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’ ’ అంటున్నారు నిర్మాతలు. విక్రమ్, సమంత జంటగా విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘10 ఎన్రదుకుళ్ల’.

ఈ సినిమాను తెలుగులో ‘10’ అనే టైటిల్‌తో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై జి.సుబ్రమణ్యం, ఎం. సుబ్బారెడ్డి, రామారావు ఈ నెల 15న తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వారు మాట్లాడుతూ..‘‘ ఈ చిత్రంలో విక్రమ్‌ పాత్ర కొత్తగా ఉంటుంది. సమంత ద్విపాత్రాభినయం హైలైట్‌. మాస్‌ ఆడియన్స్‌తో పాటు క్లాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top