'ఆటా నాదే వేటా నాదే' తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది

గురు' సినిమాతో తన సత్తా చాటిన విక్టరీ వెంకటేష్ తర్వాతి సినిమా 'ఆటా నాదే వేటా నాదే'. చాలాకాలం తర్వాత మరోసారి విజయాల బాట పట్టిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో వెంకీ సరసన అనుష్క ఆడిపాడనుందని తెలుస్తోంది. ఇందులో వెంకీ ఓ డిఫరెంట్ లుక్‌లో దర్శనమీయనుండటంతో ఆయన సరసన స్వీటీ అయితేనే బాగుంటుందని భావించిన యూనిట్ అనుష్కతో సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.

కొద్దిరోజులుగా ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్‌గా కాజల్, తమన్నా పేర్లు వినిపించాయి. కానీ తాజాగా వారిద్దరూ కాదంటూ అనుష్క పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనుష్క కూడా తన 'భాగమతి' సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోవడంతో వెంకీతో నటించేందుకు సిద్ధంగా ఉందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వెంకీ- అనుష్క కాంబో అని వార్త బయటకు వచ్చిందో లేదో.. వారిద్దరి ఆటా వేట చూడాలని దగ్గుబాటి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మొత్తానికైతే అధికారిక ప్రకటన వెలువడితే గాని తెలియదు వెంకీ కోసం అనుష్కను తీసుకున్నారా.. లేక వేరే హీరోయిన్‌ను తీసుకున్నారా ? అనేది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top