మెగా హీరో షెడ్యూల్ పూర్తి చేశాడు

ముకుంద - కంచెలాంటి సినిమాలతో మంచి నటుడిగా పేరొచ్చినా మెగా హీరో వరుణ్ తేజ్ కోరుకున్న కమర్షియల్ హిట్ దక్కింది మాత్రం ఫిదా సినిమాతోనే. అమెరికా అబ్బాయి తెలంగాణా అమ్మాయి మధ్య నడిచిన ప్రేమకథతో శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల ఇద్దరికీ ఓ కమర్షియల్ హిట్ ఎంతో అవసరమైన టైంలో వచ్చిన ఈ సినిమా వారిద్దరి ఆశలను నెరవేర్చింది.

ఫిదా తెచ్చిన ఉత్సాహంతో వరుణ్ తేజ్ తన నెక్ట్స్ సినిమా షూటింగ్ చకచకా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ముహూర్తం షాట్ రెండు నెలల క్రితమే తీసినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఫిదా రిలీజ్ తర్వాతే స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ గా ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారంటే అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసేశారు. హీరోయిన్ రాశీఖన్నా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా హీరో వరుణ్ తేజ్ - డైరెక్టర్ వెంకీ అట్లూరితో తీసుకున్న సెల్ఫీలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

మిస్టర్ - లోఫర్ సినిమాలతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి భంగపడ్డ వరుణ్ తేజ్ తనకు పేరు తెచ్చిపెట్టిన లవ్ స్టోరీలపైనే కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఫిదా కూడా అతడి నమ్మకాన్ని పెంచింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమా కూడా ఎంటర్ టెయిన్ మెంట్ మిక్స్ డ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ యునిట్ విదేశాలకు వెళ్ళనున్నారట. అది సంగతి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top