ఉపాసన "అజ్ఞతవాసి" గురించి ఏమన్నారో చుడండి

టాక్‌తో సంబంధం లేకుండా సామాన్యుల‌తోపాటు కొంత‌మంది సినీ ప్ర‌ముఖులు సైతం `అజ్ఞాత‌వాసి` సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ సినిమాను విడుద‌ల‌కు ముందే మెగా ఫ్యామిలీ కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌నున్నారని ఇంత‌కుముందే వార్త వ‌చ్చింది. తాజాగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా `అజ్ఞాత‌వాసి`ని చూశార‌ట.

ఈ విష‌యాన్ని ఉపాసన ట్విట‌ర్ ద్వారా స్వ‌యంగా తెలియ‌జేశారు. అయితే ఆమె ఇండియాలో కాకుండా అమెరికాలో `అజ్ఞాత‌వాసి` సినిమా చూశారు. ``అజ్ఞాత‌వాసి` చూసేందుకు ప‌నుల‌న్నీ త్వ‌ర‌గా ముగించుకున్నాను. అమెరికాలో సినిమా చూస్తున్నాను. అన్ని ఏర్పాట్లు చేసినందుకు మిస్ట‌ర్ `సి`కి ధ‌న్య‌వాదాలు. కొణిదెల మ్యాజిక్` అని ఉపాస‌న ట్వీట్ చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top