త్రివిక్రమ్ దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ చిత్రం

విక్టరీ వెంకటేష్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. బుధవారం వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో తారాగణం, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సాధారణంగా వెంకటేష్‌ సినిమాల్లో డైలాగ్‌ టైమింగ్‌, పంచ్‌లు బాగా ఉంటాయి. ఆయన నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘వాసు’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ రాశారు. ఈ సినిమాలు ప్రేక్షకుల్ని బాగా నవ్వించాయి. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న కొత్త చిత్రంపై ఆసక్తి నెలకొంది.

‘గురు’ సినిమా తర్వాత వెంకటేశ్‌ తేజ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. త్రివిక్రమ్‌ ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన ఎన్టీఆర్‌ హీరోగా సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక వెంకటేష్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top