త్రివిక్రమ్ మార్క్ లేదన్నారుగా చుడండి

ఓ స్టార్ హీరో సినిమా బాగోకపోతే ట్రాలింగ్ మొదలైపోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. మూడు రోజుల క్రితం విడుదల అయిన పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి విషయంలో మాత్రం ఈ విమర్శలు మరీ పీక్ స్టేజ్ లో ఉన్నాయి. సినిమా నిలబడలేకపోవడానికి పవర్ స్టార్ అభిమానులు నిరాశతో చేస్తున్న కామెంట్సే ఎక్కువ ప్రభావం చూపాయనే కామెంట్స్ వినిపిస్తుంది.

అజ్ఞాతవాసిపై వస్తున్న కామెంట్స్ లో అత్యధికం.. ఈ సినిమాలో త్రివిక్రమ్ పెన్ను పవర్ తగ్గిందనే అంటున్నారు. అయితే.. అజ్ఞాతవాసి మూవీపై వస్తున్న ఈ విమర్శలు అర్ధ రహితం అంటున్నారు త్రివిక్రమ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. మూవీ నచ్చక ఏకపక్షంగా విమర్శలు చేస్తుండడంతో.. సినిమాలో వినిపించిన అమూల్యమైన సంభాషణలు.. డైలాగ్స్ విలువ తెలుసులేకపోతున్నారని వారు అంటున్నారు. అజ్ఞాతవాసిలో అద్భుతమైన డైలాగ్స్ ను లిస్ట్ కూడా చేసేశారు.

1. కుందేళ్లు అన్నీ కులాసాగా తిరుగుతున్నాయి, సింహం సరదాగా వచ్చేయొచ్చు.

2. ఒక ఆయుధం తయారు చెయ్యాలంటే ఒక చెయ్యి కావాలి.. ఒక ఆలోచన కావాలి.. ఒక స్వార్ధం కావాలి. కానీ విధ్వంసం రావాలంటే ఒక అన్యాయం జరగాలి.

3. నేను పెంచింది మాములు మనిషిని కాదు, ఒక యుద్ధం అంత విధ్వంసాన్ని, నడిచే మారణహోమాన్ని.

4. విచ్చలవిడిగా నరికితే హింస, విచక్షణతో నరికితే ధర్మం.

5. ఒకడికి ఆకలి వేస్తుంది అంటే ఎందుకు అని అడగరు, అదే అధికారం కావాలి అని అడిగితే ఎందుకు అని అడుగుతారు. ఎందుకు?

6. ఎప్పుడూ జరిగేదాన్ని అనుభవం అంటారు.. ఎప్పుడో జరిగేదాన్ని అద్భుతం అంటారు.

7. మనుషులకు ఇంకొకడు సంపాదించిన డబ్బు అంటే ఎందుకు అంత ఆశ?

8. రాజ్యం మీద ఆశ లేని వాడికంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు?

9. ఇన్ఫర్మేషన్ మొత్తం ఐఫోన్ లోను.. జీవితం మొత్తం గూగుల్ లో పెట్టేస్తున్నారు

10. చిన్న పిల్లలు ఆకలితో ఉన్నా.. ఆడపిల్లలు ఏడ్చినా ఈ దేశం బాగుపడదు.

11. విందా మీలాగే మాములు మనిషి.. కానీ అతని ఆశయం మాత్రం సాయంకాలం నీడ లాగా చాలా పెద్దది

12. ఎవడో వచ్చి విందా నాకు బాబు.. నేను విందాకి బాబు అంటే.. దా ఇందా కూర్చో అంటామా?

13. విమానం ఎక్కిన ప్రతివాడు ఎగురుతున్నాం అనుకుంటాడు. కానీ నిజానికి విమానం ఒక్కటే ఎగురుతుంది.. మనం కూర్చుంటాం అంతే. అలాగే ఈ ఏజ్ లో అన్నీ తెలుసు అనిపిస్తది, తెలవదు..! అనిపిస్తది అంతే

14. మా నాన్న మూసిన తలుపులకు అవతల చనిపోయిన మీ అన్నయ్యనే చూస్తున్నావ్. ఆయన బ్రతికించిన కుటుంబాలని వెలిగించిన దీపాల్ని నువ్వు చూడట్లేదు, చూడలేదు, చూడలేవు మరి ఇంత అద్భుతమైన డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ పెన్ పవర్ ఏ మాత్రం తగ్గలేదని.. అనవసరంగా విమర్శలు చేస్తున్నారని వారి వాదన.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top