ఇదే నా నెంబర్‌..ఎప్పుడైనా కాల్‌ చేయండి

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌కి భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన సెలబ్రెటీల్లో షారుక్‌ కూడా ఒకరు అనడంలో సందేహంలేదు. తాజాగా షారుక్‌.. రాజీవ్‌ మసంద్‌ టాక్‌షోలో పాల్గొన్నారు. ఆయన నటిస్తున్న ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్ర ప్రచార కార్యక్రమం కోసం షారుక్‌ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌లో తన గురించి ఎక్కువగా వెతికిన ప్రశ్నలకు షారుక్‌ ఇలా సమాధానాలు ఇచ్చారు.

* షారుక్‌కి టాటూ ఉందా?
షారుక్‌: లేదు. ఓ సినిమా కోసం నేను నా కుడి భుజంపై టెంపరరీ టాటూ వేయించుకున్నా. ఆ తర్వాత ఎప్పుడూ వేయించుకోలేదు. నాకు టాటూలంటే భయం.

* షారుక్‌కి ప్రైవేట్‌ జెట్‌ ఉందా?
లేదు. కానీ ఒకటి కొనుక్కోవాలని ఉంది. ఎప్పటికైనా ఓ జెట్‌ కొనుక్కునిఅందులో సినిమా చూడాలన్నది నా ఆశ

* షారుక్‌ ఫోన్‌ నెంబర్‌ ఏంటి?
5559960321. ఇదే నా ఫోన్‌ నెంబర్‌. మీరు నాకు ఎప్పుడైనా ఫోన్‌ చేయచ్చు. నేను లిఫ్ట్‌ చేస్తాను. లేకపోతే మెసేజ్‌ చేస్తాను.

* షారుక్‌ అసలు పేరేంటి?
నా అసలు పేరు షారుక్‌ ఖానే. కానీ నేను పుట్టాక మా నానమ్మ నాకు అబ్దుల్‌ రెహమాన్‌ అని నామకరణం చేయాలనుకుంది. కానీ నాన్నే నాకు షారుక్‌ అని పెట్టారు. కానీ నన్ను అభిమానులు ముద్దు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు.

* షారుక్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడా?
ప్రైవేట్‌ జెట్‌ కూడా లేదు. నేను ధనవండుడైన నటుడిని ఎలా అవుతాను. కానీ అల్లా ఆశీర్వదిస్తే అవుతానేమో.

* షారుక్‌ ఎందుకు అంత ఫేమస్‌?
చూడ్డానికి అందంగా, పొడుగ్గా ఉంటా. బాగా మాట్లాడతా. బహుశా నేను అందుకే ఫేమస్‌ అయివుంటాను.

* షారుక్‌ తన భార్య గౌరిని ఎలా కలుసుకున్నారు?
నేను తనని ఓ స్కూల్‌ పార్టీలో కలుసుకున్నాను. అప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఎదురెదురుగా కూర్చుని డ్యాన్సులు చేస్తున్నారు. నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు. సో.. గౌరి డ్యాన్స్‌ చేస్తున్నప్పుడే నేను తనని చూశాను.

* షారుక్‌ ‘మన్నత్‌’ (షారుక్‌ నివాసం పేరు) ఎలా కొనుక్కున్నారు?
నేను పడిన కష్టంతో కొనుక్కున్నాను. ప్రకటనలు, షోలు, సినిమాలు చేస్తూ వచ్చిన డబ్బుతో కొనుక్కున్నాను. ఇక నా పిల్లలకు ఏ ఢోకా ఉండదు. వారికి ఓ ఇల్లు కొనగలిగాను.

* షారుక్‌ పాడగలడా?
పాడగలను. కానీ నా ట్యాలెంట్‌ ఏంటో నేను నిరూపించుకున్నాను. పాడాలనుకుంటే నేను రిటైర్‌ అయ్యాక నాకు నేను పాడుకుంటాను. చెప్పాలంటే నా సినిమాలోని రెండు పాటలను పాడగలను.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top